హీరోయిన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన టీమిండియా క్రికెటర్

రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు.కొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోగా, మరికొందరు వివాహం చేసుకుని తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ క్రికెటర్‌ హీరోయిన్‌తో కనిపించి షాకిచ్చాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు భారత క్రికెటర్ శిఖర్ ధావన్.

ధావన్ నటి సోఫీ షైన్‌‌తో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరు తరుచూ కలిసి దర్శనం ఇస్తున్నారు.శిఖర్ ధావన్‌కు గతంలోనే పెళ్లైన సంగతి తెలిసిందే.భార్య అయేషా ముఖర్జీతో ధావన్ విడాకులు తీసుకున్నారు.ఢిల్లీలోని ఒక కుటుంబ న్యాయస్థానం 2023 అక్టోబర్‌లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయేషా ముఖర్జీ తన భర్తను మానసికంగా హింసించిందని పేర్కొంటూ ధావన్ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధావన్ వైవాహిక జీవితం ఇలా విడాకులతో ముగిసింది.

Team India cricketer maintaining relationship with actress

భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం ధావన్ నటి సోఫీ షైన్‌‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో తన ప్రేమ జీవితం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ధావన్ తాను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నానని పరోక్షంగా వెల్లడించాడు. అయితే, తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకుండా, "ఈ గదిలో ఉన్న అందమైన అమ్మాయే నా గర్ల్‌ఫ్రెండ్" అని చమత్కారంగా బదులిచ్చాడు. ఆ సమయంలో కెమెరాలు సోఫీ షైన్‌పై కేంద్రీకరించగా, ఆమె సిగ్గుపడుతూ కనిపించింది.

సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్ అని సమాచారం. ఆమె ధావన్‌తో కలిసి దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుండి వారిద్దరూ కలిసి పలుమార్లు కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.తాజాగా వీరిద్దరు మరోమారు మీడియాకు దొరికిపోయారు. ఎయిర్‌పోర్టులో వీరు కలిసి రావడం కనిపించింది. దీంతో ఈ జంట రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్ప్ అయిపోయారు.

ఇక శిఖర్ ధావన్ కెరీర్ విషయానికి వస్తే..అతను ఒక దశాబ్దం పాటు భారత క్రికెట్ జట్టుకు గొప్ప వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.అతను 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్‌కు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచాడు.ICC టోర్నమెంట్లలో అతని బ్యాటింగ్ సగటు చాలా ఎక్కువగా ఉంది (65.15), కనీసం 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇది అత్యధికం.ధావన్ 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు మరియు 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు.అయితే ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+