పాకిస్తాన్ ముందు కొండంత టార్గెట్: డెత్ ఓవర్లల్లో విరుచుకుపడ్డ ఆ ఇద్దరూ

జపాన్ ఐచి- నగోయాలో కొనసాగుతున్న ఆసియా గేమ్స్ లో భాగంగా దాయాదుల ఫైనల్ మ్యాచ్ లో భారత్.. భారీ స్కోర్ సాధించింది. తన ఆర్క్ రైవల్ పాకిస్తాన్ ముందు కొండంత టార్గెట్ ఉంచింది. తొలుత ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు సత్తా చాటారు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా ఇన్నింగ్ లో మొత్తం రెండు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. నిర్ణీత 20 ఓవర్లల్లో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది భారత్.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ప్రారంభంలో భారత్ తడబడింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లతో 15 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. దూకుడుగా ఆడినప్పటికీ.. ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. సయీమ్ అయూబ్ బౌలింగ్ లో ఉస్మాన్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Team India set a Huge Target to its Arch Rival Pakistan in Final Match Tilak Varma and Shivam Dube

అతని తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా విఫలం అయ్యాడు. రెండు పరుగులే చేసి అహ్మద్ డానియల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు వరుసగా పడినప్పటికీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పిడుగుల్లాంటి షాట్లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ అదే రేంజ్ లో సెంచరీ వైపు దూసుకెళ్తోన్న దశలో అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేసిన అనంతరం అరాఫత్ మిన్హాస్ బౌలింగ్ లో స్టంపవుట్ గా వెనుదిరిగాడు.

చేజేతులా వికెట్ పారేసుకున్న అభిషేక్ శర్మ: సంజు శాంసన్ దీ పాతకథే
చేజేతులా వికెట్ పారేసుకున్న అభిషేక్ శర్మ: సంజు శాంసన్ దీ పాతకథే

కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్- 21, ఇషాన్ కిషన్ 20 పరుగులతో నిరాశపరిచారు. ఒకదశలో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతుందనే ఆందోళన సైతం వ్యక్తమౌంది టీమిండియా క్యాంప్ లో. ఆ దశలో క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. 22 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. అజేయుడిగా నిలిచాడు. లోయర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ శివం దుబే నుంచి అతనికి చక్కటి సహకారం అందింది. దుబే.. 15 బంతుల్లో రెండేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లతో 27 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు.

పాకిస్తాన్ బౌలర్లల్లో అహ్మద్ డానియల్, అరాఫత్ మిన్హాస్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. సయీం అయూబ్, అబ్రార్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 212 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి పాకిస్తాన్ బరిలోకి దిగింది. మొదటి ఓవర్ ముగిసే సమయానికి 13 పరుగులు చేసిందా జట్టు. కేప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సదాకత్ క్రీజ్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+