ఆస్ట్రేలియాపై సెంచరీతో తడాఖా చూపిన బావుమా

ఆస్ట్రేలియాతో సెయింట్ జార్జ్ పార్క్ లో జరుగుతున్న రెండో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో సఫారీ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక దశలో 97 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన దక్షిణాఫ్రికా.. చివరికి 9 వికెట్లకు 425 పరుగుల భారీ స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్ డిక్లేర్ చేసి మ్యాచ్‌ను తన వైపు తిప్పుకొంది.

దక్షిణాఫ్రికా ఈ రేంజ్ లో తేరుకోవడంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా పోరాటం అత్యంత కీలకంగా మారింది. క్రీజ్ లో పట్టుదలగా నిలిచిన బావుమా 334 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 179 పరుగులు చేశాడు. జట్టును సురక్షిత స్థితికి చేర్చాడు. టెస్ట్ క్రికెట్‌లో బావుమాకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2023లో వెస్టిండీస్‌పై సాధించిన 172 పరుగుల రికార్డును అతను ఈ మ్యాచ్ ద్వారా తుడిచిపెట్టేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో శతకంతో మెరిసి జట్టుకు కొండంత అండగా నిలిచాడు.

Temba Bavuma 179 Powers South Africa to Control 2nd Test Match on Australia Jansen and Harmer shines

బావుమాకు లోయర్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి అద్భుత మద్దతు లభించిందీ మ్యాచ్‌లో. ఆల్ రౌండర్ మార్కో జెన్ సెన్ 85 పరుగులు చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో అయిదో హాఫ్ సెంచరీ. సైమన్ హార్మర్ 82 పరుగులతో తడాఖా చూపాడు. తొలి టెస్టు అర్ధశతకాన్ని సాధించాడు. వీరిద్దరూ బావుమాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ ముగ్గురూ తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు.

59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ
59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ

ఓపెనర్లు ఎయిడెన్ మార్క్ రమ్- 11, మార్క్యూస్ అకెర్ మన్- 6, డేవిడ్ బెడింగ్హామ్- 0, మాథ్యూ బ్రీట్జ్కె- 31, వియాన్ ముల్డర్- 13 పరుగులు చేశారు. కగిసొ రబడ డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ స్కాట్ బోలాండ్ అయిదు వికెట్లు కూల్చాడు. చేతిలో ఇంకా ఒక వికెట్ మిగిలివుండగానే ఇన్నింగ్ ను డిక్లేర్ చేసింది దక్షిణాఫ్రికా. ఈ వ్యూహం ఫలించింది కూడా. ఇన్నింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కగిసొ రబడ బౌలింగ్ లో నిక్ మ్యాడిసన్ డకౌట్ అయ్యాడు. మూడో రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి మూడు పరుగులు చేసింది.

ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్
ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్

97 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి 425 పరుగుల కొండంత స్కోరు నిలపడం దక్షిణాఫ్రికాకు మ్యాచ్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. నాలుగో రోజు ఆటలో సఫారీ బౌలర్లు ఈ ఒత్తిడిని కొనసాగిస్తే ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+