టీమ్ ఇండియాలో అత్యంత కష్టజీవి అతనే..? కొహ్లీ కాదా..!
భారత క్రికెట్ జట్టులో మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న క్రికెటర్లతో పాటు అడపాదడపా వచ్చిపోతున్న ఆటగాళ్లూ ఉన్నారు. అయితే నిలకడగా రాణించాలంటే, జట్టులో చోటు కొనసాగించాలంటే మాత్రం ఫిట్ నెస్ చాలా తప్పనిసరి. ఇందుకు ఎంతో కఠోర శ్రమ, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. ఈ లక్షణాలన్నీ ఉన్న అరుదైన క్రికెటర్ గా కింగ్ విరాట్ కొహ్లీని అభిమానులు చెప్తుంటారు. అందుకే దశాబ్దానికి పైగా జట్టులో కొనసాగుతున్నా ఇప్పటికీ కొహ్లీ ఓ సంచలనమే.
అయితే విరాట్ కొహ్లీని మించి జట్టులో కష్టజీవి ఎవరైనా ఉన్నారా అంటే అభిమానులు చెప్పలేరేమో కానీ జట్టులో సహచర క్రికెటర్ ఒకరు మాత్రం వేరే పేరు చెప్పేశారు. అతనే ప్రస్తుత వన్డే జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్. వన్డేలు, టెస్టులు, టీ20ల్లో నిలకడగా రాణిస్తూ జట్టులో అత్యంత ఫిట్ క్రికెటర్లలో ఒకరిగా పేరున్న శుభ్ మన్ గిల్ ఎంతో కష్టజీవి అని అతని సహచరుడు, మరో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తాజాగా జాతీయ మీడియా ఛానల్ ఆజ్ తక్ కు వెల్లడించాడు. ఇందుకు గల కారణాలూ చెప్పాడు.

తాను శుభ్ మన్ గిల్ ను ఈ మధ్య చాలా దగ్గరగా చూశానని యశస్వీ జైశ్వాల్ వెల్లడించాడు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడని, అతని దినచర్యలోనూ చాలా స్థిరంగా ఉంటాడని తెలిపాడు. గిల్ ఫిట్‌నెస్, ఆహారం, నైపుణ్యాలు, శిక్షణపై చాలా కృషి చేస్తాడన్నాడు. ఇది నమ్మశక్యం కాదని కూడా తెలిపాడు. తాను గిల్ ను చూడటం, అతనితో ఆడటాన్ని చాలా ఆనందిస్తానన్నాడు. అతను కూడా అద్భుతమైన వ్యక్తి అని జైశ్వాల్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతంగా , తెలివిగా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు. గిల్ ప్రతి పరిస్థితిలోనూ రాణిస్తాడని జట్టులో తామంతా నమ్ముతున్నట్లు
జైశ్వాల్ వెల్లడించాడు.












Click it and Unblock the Notifications