Ind-NZ ODI: న్యూజీలాండ్ తో సిరీస్ ఓటమి వెనుక ముగ్గురు విలన్లు ?

భారత్-న్యూజీలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. కివీస్ చేతిలో భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఎంతో ఉత్సాహంగా కొత్త ఏడాదిలో స్వదేశంలో తొలి వన్డే గెలిచి సిరీస్ ను ప్రారంభించిన భారత్.. రెండో వన్డేలో అనూహ్యంగా సిరీస్ సమం చేసే అవకాశాన్ని కివీస్ చేతిలో పెట్టేసింది. ఆ తర్వాత సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో సైతం భారీగా పరుగులు సమర్పించుకోవడం ద్వారా మరోసారి న్యూజీలాండ్ కు మ్యాచ్ ను, అలాగే సిరీస్ ను గెల్చుకునే అవకాశం ఇచ్చేసింది.

స్వదేశంలో అన్ని అనుకూలతల మధ్య జరిగిన ఈ సిరీస్ ను భారత్ 1-2 తేడాతో కోల్పోవడాన్ని సగటు క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ ఓటమి వెనుక ఉన్న మూడు కారణాలను ఓసారి పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యమైన కారణం రోహిత్ శర్మ. సాధారణంగా జట్టులో దూకుడైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న మాజీ కెప్టెన్.. ఈ సిరీస్ లో మాత్రం వరుస వైఫల్యాలతో అసలు విలన్ గా మారిపోయాడు. మిస్సైల్ ఇన్నింగ్స్ ఆడాల్సిన రోహిత్ కాస్తా పేలవంగా అవుట్ అయిపోతుంటే.. గిల్, కొహ్లీపై ఒత్తిడి పెరిగిపోయింది. అదే టోర్నీలో ఓటములకు కారణమైంది.

The Three Players Who Sealed India s ODI Fate Against New Zealand

ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మరో కారణం రవీంద్ర జడేజా. టీమిండియాలో నమ్మకమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న జడేజా ఈసారి బ్యాట్, బాల్ రెండింటితోనూ ప్రభావం చూపలేకపోయాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ను పరుగులు తీయకుండా ఆపడంలో జడేజా వైఫల్యం ఈసారి స్పష్టంగా కనిపించింది. చివరి వన్డేలో అయితే అసలు వికెటే తీయలేకపోయాడు. కుల్దీప్ వంటి స్పిన్నర్ల నుంచి సహకారం అందినా జడేజా సద్వినియోగం చేసుకోలేదు.

The Three Players Who Sealed India s ODI Fate Against New Zealand

ఇక వన్డే సిరీస్ ఓటమికి మరో కీలకమైన కారణం మిడిల్ ఆర్డర్ గందరగోళం. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు చివరి వన్డేలో విఫలం కాగా.. మిడిల్ ఆర్డర్ యొక్క సమిష్టి వైఫల్యం సిరీస్ ఓటమికి కారణమైంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో
భారత్ కేవలం తొమ్మిది ఓవర్ల వ్యవధిలో 28/0 నుండి 71/4కి పతనం కావడానికి ఇదే కారణం. అయ్యర్, రాహుల్ వైఫల్యం కొహ్లీ శతకాన్ని సైతం వృథా చేసింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి సైతం 43 బంతుల్లో 52 పరుగులతో ఆదుకున్నా.. కీలక బ్యాటర్ల వైఫల్యం మాత్రం మ్యాచ్ తో పాటు సిరీస్ ఓటమికి కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+