IPL 2026: వేలం తర్వాత మారిన కెప్టెన్లు - ఏ టీంకు ఎవరు, ఇదీ లెక్క..!!

IPL 2026: ఐపీఎల్ 2026 కు మినీ వేలం ముగిసింది. ఏ జట్టులో ఏ ప్లేయర్ అనేది స్పష్టత వచ్చింది. ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లు వేలంలో అమ్ముడయ్యారు. మొత్తం 369 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. స్టార్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచారు. ఇప్పుడు వేలం పూర్తయిన తరువాత టోర్నీలో పాల్గొనే టీంల కెప్టెన్ల పైన చర్చ మొదలైంది. కొన్ని టీంలకు ప్రస్తుతం సారధ్యం వహిస్తున్న వారి మార్పులతో కొత్త కెప్టెన్లు ఖరారయ్యారు.

ఐపీఎల్ వేలం పూర్తి కావటంతో జట్ల సభ్యుల పైన క్లారిటీ వచ్చేసింది. కొందరి ఆటగాళ్ల మార్పు కారణంగా కొన్ని జట్ల సారధ్య బాధ్యతల్లోనూ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా నాలుగు జట్ల వరకు కెప్టెన్లు మార్పు ఖాయంగా భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. 2026 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా కొనసాగటం ఖాయం. 2025లో ఆర్‌సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను పాటిదార్‌కు అందించాడు. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడంలో రజత్ పాటిదార్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. ఇక.. శుభ్‌మాన్ గిల్ IPL 2026లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తాడు. గిల్ కెప్టెన్సీ పైనే జట్టు యాజమాన్యం నమ్మకంతో ఉంది.

Three IPL teams that might announce new captains after the IPL 2026 auction

కాగా.. పంజాబ్ టీం కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో ఫైనల్‌లో RCB చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయితే, అయ్యర్ కెప్టెన్సీలో, పంజాబ్ దశాబ్దం తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ 2026లో కూడా అతను జట్టు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. హైదరాబాద్ ఐపీఎల్ 2025 సీజన్‌ను అవమానకరంగా గడిపింది. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో, జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఇబ్బంది పడింది. అయినప్పటికీ, ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అనేక మంది అద్భుతమైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. అయితే, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వచ్చే ఏడాది జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగుతారు.

సీఎస్కే సంజు సామ్సన్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, గైక్వాడ్ కెప్టెన్సీ కి ఇబ్బంది లేదు. ఇక.. గత ఏడాది ఐపీఎల్‌లో అజింక్య రహానే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సారి రహానానే కెప్టెన్‌గా నియమించాలని KKR జట్టు యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్, ఫాఫ్ డు ప్లెసిస్ సంయుక్తంగా కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ,
ఇప్పుడు డుప్లెసిస్ జట్టులో లేకపోవడంతో, అక్షర్‌ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. దీంతో, కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చే ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఆడనుంది. వారి రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. జట్టు రియాన్ పరాగ్‌ను పూర్తి సమయం కెప్టెన్‌గా ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+