కివీస్ తో సిరీస్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్, టీ20 ప్రపంచ కప్ కు డౌట్..!!
న్యూజీలాండ్ తో సిరీస్.. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ టీమిండియా కు భారీ ఎదురు దెబ్బ తగిలిగింది. టీంలో కీలక ఆటగాడు దూరం అయ్యాడు. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ కు పొట్ట కింది భాగంలో గాయమైంది. దీంతో.. అస్వస్థతకు గురైన తిలక్ కు సర్జరీ జరిగింది. ఈ కారణంగా 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ కు తిలక్ దూరం అయినట్లు అధికారికంగా ఖరారైంది. అయితే.. టీ 20 ప్రపంచ కప్ కు తిలక్ ఆడే అవకాశాలు కనిపించటం లేదు. మరి.. తిలక్ స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది. ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి.
న్యూజీలాండ్ సిరీస్.. టీ20 ప్రపంచ కప్ కు స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ దూరం కానున్నారు. కివీస్ తో సిరీస్ కు తిలక్ అందుబాటులో ఉండదని అధికారికంగా నిర్దారించారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న తిలక్‌కు ఇటీవల పొట్ట కింది భాగంలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. డాక్టర్ల సూచన మేరకు అతడికి సర్జరీ చేయించారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.

ఈ సర్జరీ కారణంగా తిలక్ వర్మ నాలుగు వారాలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఐదు మ్యాచ్ ల సిరీస్ కు తిలక్ ను ఎంపిక చేసారు. అయితే, సర్జరీ కావడంతో ఈ సిరీస్‌కు తిలక్ అందుబాటులో ఉండడు. టీ20 ప్రపంచ కప్ కు సైతం తిలక్ అందుబాటులో ఉండటం డౌట్ గానే కనిపిస్తోంది.
తిలక్ వంటి హిట్టర్ ప్రపంచ కప్ ముందు గాయపడటం.. టీమిండియాకు భారత్ కు పెద్ద దెబ్బ గా మారుతోంది. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దీంతో.. ఇప్పుడు తిలక్ స్థానం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి నాగపూర్ లో న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, యశస్వీ జైశ్వాల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, టీ20 ప్రపంచ కప్ లో తిలక్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది వచ్చే వారం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ ముందు జరుగుతున్న న్యూజీలాండ్ సిరీస్ కీలకం కానుంది. దీంతో.. ఇప్పుడు తిలక్ వర్మ డిశ్చార్జ్.. టీ20 ప్రపంచ కప్ లో కొత్త ఎంట్రీ పైన బీసీసీఐ అధికారిక ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications