IND Vs AUS: అహ్మదాబాద్ లో టాలీవుడ్ హీరోల సందడి - మహేష్ పై మీమ్స్..!!

ప్రపంచ కప్ ఫైనల్ మేనియా దేశాన్ని ఊపేస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరుకు అహ్మదాబాద్ వేదికగా అంతా సిద్ధమైంది. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా జట్టు కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు సినీ ప్రముఖులు అహ్మదాబాద్ బయల్దేరారు. ఇదే సమయంలో మహేష్ బాబు సెంటిమెంట్ కూడా ఒకటి కూడా బయటకు వచ్చింది. దీంతో మీమ్స్ మొదలయ్యాయి.

కప్ మనదేనంటూ : ప్రపంచ కప్ లో భారత్ గెలవలాని కోట్లాది మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖులు హాజరవుతున్నట్లుగా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారే కాకుండా పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలెందరో స్టేడియంలో సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ , మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారంతా అహ్మదాబాద్నరేంద్ర మోదీ స్టేడియానికి క్యూ కట్టారు.

Tollywood Heros and Cine celbraties Reaches Ahmedabad for World Cup Final,Viral in Social media

సెంటిమెంట్ పండిస్తూ : ఈ మ్యాచ్ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక సెంటిమెంట్స్ బయటికి వస్తున్నాయి. అందులో మహేష్ బాబు సెంటిమెంట్ ఒకటి. అదేమిటని అనుకుంటున్నారా? అవును మరి.. అమితాబచ్చన్ నేను మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుందని ఓ సెంటిమెంట్‌ని స్వయంగా ఆయనే రివీల్ చేశారు. అలానే కొన్ని ఉంటాయి. వాటిలో మహేష్ బాబు సెంటిమెంట్ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌తో కలిసి 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయ పతాకం ఎగురవేసి చరిత్ర సృష్టించింది.

Tollywood Heros and Cine celbraties Reaches Ahmedabad for World Cup Final,Viral in Social media

మహేష్ మ్యాచ్ కు వెళ్లాలంటూ : అలాంటి చరిత్ర మళ్లీ రిపీట్ కావాలంటే.. మరోసారి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నరేంద్ర మోదీ స్టేడియంలోసందడి చేయాలని కొందరు మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ మీమ్స్ బీభత్సంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ అభిమానులు కొందరు.. ప్లీజ్ మహేష్ అన్నా.. మీరు మ్యాచ్ చూడడానికి వెళ్లండి అంటూ రిక్వెస్ట్‌లు కూడా పెడుతున్నారంటే.. సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో స్పష్టం అవుతోంది. కానీ, మహేష్ అహ్మదాబాద్ వెళ్తున్నట్లు ఎక్కడా సమాచారం లేదు. కానీ, అభిమానుల కోరిక మేరకు మహేష్ స్టేడియంలో కనిపిస్తే అధి ఫ్యాన్స్ కు పండుగే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+