మీకు దండం పెడతా..అతన్ని జట్టులో నుంచి తీసేయండి ప్లీజ్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.తొలి టెస్ట్‌లో భారత జట్టును న్యూజిలాండ్ మట్టికరిపించింది. 36 ఏళ్ల తర్వాత భారత జట్టుపై న్యూజిలాండ్ స్వదేశంలో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మకు తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. 49 పరుగులకే జట్టు మొత్తం అలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లందరూ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇదే పిచ్‌పై న్యూజిలాండ్ పరుగుల వరద పారించారు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లు కూడా సత్తా చాటారు. సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 99 పరుగులు చేశాడు. అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో టీమిండియా ఓటమి ఖాయం అయింది. కేవలం 107 పరుగల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయిన న్యూజిలాండ్, భారత్‌పై ఘన విజయం సాధించింది. అయితే భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్ల వైఫల్యమే అని తెలుస్తోంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ వైఫల్యం జట్టు ఓటమికి కారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తొలి టెస్టులో రాహుల్ పూర్తిగా నిరాశపరిచాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో పన్నెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. జట్టు విజయం వైపు పయనిస్తుందనుకునే సమయంలో రాహుల్ తన ఆటతీరుతో ఓటమి వైపు నడిపించాడు. సర్ఫరాజ్ , పంత్ ఇద్దరూ నాలుగో రోజు ఆట నిలబెట్టారు. వీరిద్దరు జట్టును అధిక్యం వైపు నడిపించారు. అయితే పంత్ 99 పరుగుల వద్ద అవుట్ అవడంతో,క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టీమిండియా అలౌట్ అయింది.
అదే కేఎల్ రాహుల్ క్రీజ్‌లో నిలబడి పరుగులు చేసి ఉంటే ఈ రోజున ఫలితం మరోలా ఉండేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ వరుసగా ఫెయిల్ అవుతున్న ఎందుకు అవకాశాలిస్తున్నారని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కేఎల్ రాహుల్ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు. ఇంత దారుణంగా ఫెయిల్ అవుతున్న అవకాశాలివ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అతన్ని జట్టు నుంచి తప్పించి యంగ్ ప్లేయర్లకు అవకాశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications