పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అంటే మరీ అంత లోకువైపోయిందేట్రా- ప్యాడ్స్ కట్టుకుని రెడీగా ఉన్న ఉగాండా
టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిపై అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. రోజుల తరబడి సాగుతోందీ వ్యవహారం మొత్తం కూడా. ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకొంది. ఈ జట్టుకు మద్దతుగా టోర్నమెంట్ ను స్పాయిల్ చేసేలా పాకిస్తాన్ అనూహ్య ఎత్తుగడలు వేస్తోంది గానీ ఏవీ పెద్దగా వర్కవుట్ కావట్లేదు.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ లో ఆడకపోవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి మరింత బలాన్ని చేకూర్చేలా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ కూడా మాట్లాడారు. పాకిస్తాన్ వైదొలిగితే చోటు చేసుకోబోయే పరిణామాల గురించి వివరించారు. పాకిస్తాన్ తప్పుకొంటే స్పాన్సరర్లకు భారీ నష్టాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి కోసం పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చేసిన ప్రకటన, ఐసీసీ ఆంక్షల హెచ్చరికల మధ్య పాకిస్తాన్ భాగస్వామ్యంపై సందిగ్ధత నెలకొంది.

దీంతో ఉగాండా తెరమీదికి వచ్చింది. పాకిస్తాన్ గనక తప్పుకొంటే తాము టీ20 వరల్డ్ కప్ ఆడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ ప్రతిపాదనలను పంపింది. టీ20 వరల్డ్ కప్‌లో ఒక స్థానం ఖాళీ అయితే దాన్ని భర్తీ చేయడానికి ఉగాండా పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసింది. క్రికెట్ కిట్లు, ప్యాడ్లు, పాస్‌పోర్టులు అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రత్యర్థి జట్ల నుంచి వచ్చే ఎటువంటి ఒత్తిళ్లు తమను భయపెట్టలేవని, బోల్డ్ కిట్‌తో వస్తున్నాం.. బోల్డ్ క్రికెట్ ఆడతామని పేర్కొంది.
Dear @ICC,
— Cricket Uganda (@CricketUganda) January 29, 2026
If a T20 World Cup seat opens, Uganda is ready - packed and padded.
Passports warm (not ice). No bakers leaving ovens or ships U-turning.
Heat, noise, pressure? We’ll bring the bold kit.
Yours,
Ready when you are 🇺🇬🏏 https://t.co/6FAsQDLcXw
ఉగాండా చేసిన ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. 2024 టీ20 వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉగాండా జట్టుకు ఉంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉంది. ఉగాండా కంటే ముందే ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డ్ కూడా తమ సంసిద్ధతను తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ వైదొలగుతుందనే వార్తలపై రెండుసార్లు సరదా వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ పాకిస్తాన్ వైదొలిగితే, దాని స్థానంలో తాము ఆడతామని, ప్రయాణ ఖర్చులు వంటివి చాలా కష్టంగా ఉంటాయని సెటైర్లు సంధించింది.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications