IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్‍లో దర్శనమించిన అమిత్ షా..

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చారు. భారత బ్యాటింగ్ ను ఆయన తిలకిస్తున్నారు. కాగా నరేంద్ర మోడీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బీసీసీఐ అనుకున్న విధంగానే స్టేడియంలో ప్రేక్షకుల నినాదాలతో దద్దరిల్లుతోంది. మరో వైపు భారత్ లక్ష్యం వైపు పయాణిస్తుంది. రోహిత్ శర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి షహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో ఇఫ్తికర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సిక్స్ లు మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు అలౌట్ అయింది. కెప్టెన్ బాబర్ అజం 58 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేశాడు.

Union Home Minister Amit Shah came to watch India Pakistan match in Ahmedabad

ఇమామ్ హుల్ హక్ 38 బంతుల్లో 36 పరుగులు చేశాడు. మిగతా వారు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. పాకిస్థాన్ పతనం కెప్టెన్ బాబర్ ఔట్ కావడంతో ప్రారంభమైంది. భారత బౌలర్లలో బుమ్రా 7 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ 8 ఓవర్లు వేసి 50 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 6 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 9.5 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. షర్దూల్ ఠాగూర్ 2 ఓవర్లో 12 పరుగులు ఇచ్చాడు.

ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ 30.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెఎల్ రాహుల్ 29 బంతుల్లో 19 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం స్టేడియంలో టాపాసులు కాల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+