Vaibhav Sooryavanshi: 57 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Sooryavanshi: బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ 2026 మొదటి సెమీ-ఫైనల్‌లో వైభవ్ కేవలం 42 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తూర్పు జోన్ తరఫున ఆడుతున్న ఈ యువకెరటం.. మొత్తం 81 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు సాధించాడు. ఇది వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ క్లాస్ కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.

Vaibhav Sooryavanshi: బేబీ బాస్ మరో రికార్డు - అతి చిన్న వయసులో..!!
Vaibhav Sooryavanshi: బేబీ బాస్ మరో రికార్డు - అతి చిన్న వయసులో..!!

57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్
ఈ తుఫాన్ ఇన్నింగ్స్ తో వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన అర్ధశతక వీరుడిగా నిలిచి 57 ఏళ్ల నాటి రికార్డును తిరగరాశాడు. 1969లో లక్ష్మణ్ సింగ్ 16 ఏళ్ల 23 రోజుల వయసులో సాధించిన రికార్డును అధిగమించి వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 175 రోజుల వయసులోనే ఈ ఘనతను సాధించాడు. ఆ తర్వాత స్థానాల్లో లక్ష్మణ్ సింగ్(16 ఏళ్ల 23 రోజులు), పీయూష్ చావ్లా(16 ఏళ్ల 307 రోజులు ) ఉన్నారు.

Vaibhav Sooryavanshi Breaks 57-Year-Old Duleep Trophy Record With 92 Off 81 Balls Full Details Here

దులీప్ ట్రోఫీలో అతి పిన్న వయస్సులోనే హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..!
*వైభవ్ సూర్యవంశీ(2026): 15 సంవత్సరాల 175 రోజులు
*లక్ష్మణ్ సింగ్(1969): 16 సంవత్సరాల 23 రోజులు
*పీయూష్ చావ్లా: 16 సంవత్సరాల 307 రోజులు

కెప్టెన్సీతోనూ ఆకట్టుకున్న వైభవ్
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌తోనే కాకుండా తన కెప్టెన్సీ నైపుణ్యాలతోనూ ఆకట్టుకున్నాడు. తూర్పు జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కుడి మణికట్టుకు గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దాదాపు గంటపాటు జట్టును నడిపించిన వైభవ్.. సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ కు వ్యతిరేకంగా అద్భుతమైన డీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని అతడిని పెవిలియన్ కు పంపాడు.

తెలంగాణ డీజీపీ విధ్వంసం.. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ బాదిన సీవీ ఆనంద్!
తెలంగాణ డీజీపీ విధ్వంసం.. 21 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ బాదిన సీవీ ఆనంద్!

ఆల్ రౌండ్ సత్తా చాటిన వైభవ్
ఇంతకు ముందు నార్త్ ఈస్ జోన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లో కేవలం 8 పరుగులే చేసినప్పటికీ.. బౌలింగ్ లో సత్తా చాటాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ నమ్మకంతో బంతిని చేతికివ్వగా.. 3 ఓవర్లలో 11 పరుగులిచ్చి ఒకే ఓవర్లో కిషన్ లింగ్డో, ఇమ్లివాటి లెమ్టూర్‌ల వికెట్లు పడగొట్టాడు. చాలా చిన్న వయసులోనే సీనియర్ దేశీయ క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ విభాగాల్లో రాణిస్తూ వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+