Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ నుంచి ఔట్, అసలు కారణం..!?

IPL సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పై బిగ్ అప్డేట్. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడ్డాడు. టీం సిబ్బంది సహకారంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గాయం పైన బిగ్ అప్డేట్ వచ్చింది.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ మరో సెంచరీ నమోదు చేసాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ గాయ పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. సహాయక సిబ్బంది సహకారంతో మైదానం నుంచి బయటకు వెళ్లాడు. వైభవ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓవర్ పిచ్ బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని అడ్డుకోవడానికి సర్కిల్ లోపల ఉన్న వైభవ్ సూర్యవంశీ వెనక్కి పరిగెత్తాడు. అయితే బంతిని వెంబడిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి హామ్‌స్ట్రింగ్ పట్టేసింది. వెంటనే నడవలేక మైదానంలోనే కూలబడిపోయాడు.

vaibhav-sooryavanshi-was-carried-off-the-field-while-fielding-in-rajasthan-royals-match-against-su

వైభవ్ కు చికిత్స.. కొనసాగటం పై సస్పెన్స్

వైభవ్ ఇబ్బంది పడటం చూసి వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను లేచి నడవలేకపోయాడు. కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడటంతో, సపోర్ట్ స్టాఫ్ అతనిని భుజాల మీద మోసుకుంటూ మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. సెంచరీ హీరో ఇలా వెళ్లడం ఎవరికీ నచ్చలేదు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్..278 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే వైభవ్ సేవలు చాలా అవసరం. ఈ హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనది అయితే.. వైభవ్ కనీసం 2-3 వారాల పాటు ఆటకు దూరం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. తొడ కండరాల గాయంతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అవుతాడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. విశ్రాంతి తీసుకోవటం ద్వారా వైభవ్ త్వరగా కోలుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రోజు వైభవ్ గాయం .. చికిత్స పైన అధికారికంగా అప్డేట్ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+