వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!

ఐపీఎల్ 2026 లో భాగంగా శుక్రవారం రాత్రి గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ సత్తాను మరోసారి చాటాడు. 26 బంతుల్లో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో వైభవ్ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఓడిపోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు పరాజయాన్ని రుచి చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌కు కళ్లుచెదిరే బౌండరీతో స్వాగతం పలికి, మొదటి ఓవర్‌లోనే వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కేవలం 15 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతన్ని కృనాల్ పాండ్యా అవుట్ చేశాడు గానీ అప్పటికే ఆర్సీబీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Vaibhav Suryavanshi belts a 15-ball 50 to lift Rajasthan Royals winning streak and claim Orange Cap

ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఏడు భారీ సిక్సర్లను బాదాడు. ఇది ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్యకు సమానం కావడం విశేషం. భువనేశ్వర్‌ కుమార్ ను మాత్రమే కాకుండా మ్యాచ్ విన్నర్‌గా పేరుగాంచిన జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, అభినవ్ సింగ్‌ల బౌలింగ్‌ను కూడా చీల్చి చెండాడాడు. వారి బౌలింగ్ లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో వైభవ్ కు ఇది రెండో హాఫ్ సెంచరీ.

ఈ మ్యాచ్ తో నాలుగు మ్యాచ్‌లలో 50 సగటుతో 200 పరుగులు సాధించాడీ కుర్ర క్రికెటర్. 266.67 అత్యధిక స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌ను అధిగమించి ఆరెంజ్ క్యాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జైస్వాల్ 183 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 18 సిక్సర్లు బాదాడు. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

రజత్ పటిదార్ మూడు మ్యాచ్‌లలో 13 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సమీర్ రిజ్వి 3 మ్యాచ్‌లలో 11, యశస్వి జైస్వాల్ 4 మ్యాచ్‌లలో 10 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. యశస్వీ జైస్వాల్- 183, జురెల్- 176, సమీర్ రిజ్వి- 160, అంగ్ క్రిష్ రఘువంశీ 155 పరుగులతో ఆ తరువాతి స్థానాలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+