చరిత్ర సృష్టించిన కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో న భూతో న భవిష్యత్.. ఇక చాలు సామీ అంటున్న ఫ్యాన్స్
విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు. కింగ్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. అటు టెస్టు, వన్ డే, టీ20, ఐపీఎల్ అని తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు పడింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ గా ఉన్న కోహ్లీ.. సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. T20ల్లో 100 హాఫ్ సెంచరీలు సాధించిన భారత తొలి బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.
ఆదివారం(ఏప్రిల్ 13)న రాజస్థాన్ జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ మైలురాయి అందుకున్నాడు. 174 పరుగుల ఛేదనలో దిగిన RCB 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ గేమ్ లోనే కోహ్లీ(62) పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో ఆర్సీబీ జట్టు రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కింగ్ కోహ్లీ.. ఈ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక T20ల్లో ఇప్పటివరకు 405 మ్యాచ్ లు ఆడాడు విరాట్ కోహ్లీ. 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత టీమిండియా నుంచి టాప్ 10లో రోహిత్ శర్మ మాత్రమే ఉండటం గమనార్హం. రోహిత్ ప్రస్తుతం 78 హాఫ్ సెంచరీలతో ఈ లిస్ట్ లో 9వ స్థానంలో ఉన్నాడు.
T20 fifties. One KING! 👑@imVkohli lets the bat do the talking again as he adds another illustrious feather to his cap! 🔥
— Star Sports (@StarSportsIndia) April 13, 2025
Watch the LIVE action ➡ https://t.co/1NaokWYtXf#IPLonJioStar 👉 #RRvRCB | LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar!… pic.twitter.com/Os9Zp1NzMe
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల లిస్టు ఓసారి పరిశీలిస్తే.. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 108, విరాట్ కోహ్లీ (భారత్)- 100, బాబర్ అజామ్ (పాకిస్థాన్)- 90, క్రిస్ గేల్ (వెస్టిండీస్)- 88, జాస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 86.. ఉన్నారు. విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించడంపై క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విరాట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications