క్లీన్ బౌల్డ్ అయ్యాక కోహ్లీ రియాక్షన్ చూడాలి: జస్ట్ మిస్.. బ్యాట్ విరిగిపోయేదే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అడుగు ముందుకేసింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి ఘన విజయంతో వీడ్కోలు పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 205 పరుగులు చేయగా.. దీన్ని అలవోకగా అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. 18.5 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్ లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే. దీంతో ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి సొంతగడ్డకు వీడ్కోలు చెప్పాలనే కలను సాకారం చేసుకోగలిగింది.. రజత్ పటిదార్ సేన. ఈ నెల 27న తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది ఆర్సీబీ. ఢిల్లీ కేపిటల్స్ ను ఢీకొట్టబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Virat Kohlii Fiery Reaction After the Dismissal smashed 81 with Furious Disappointed Relentless

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దేవ్ దత్ పడిక్కల్ క్లాసిక్ ఇన్నింగ్ తో కట్టిపడేశాడు. 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 44 బంతుల్లో నాలుగు భారీ సిక్సరర్లు, ఎనిమిది ఫోర్లతో 81 పరుగులు చేశాడు కోహ్లీ. 14వ ఓవర్ నాలుగో బంతికి జేసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జట్టు స్కోరు 154 పరుగుల వద్ద మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే జట్టు విజయం ఖరారైంది.

అవుట్ అయ్యాక విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశకు గురయ్యాడు. అసహనాన్ని వ్యక్తం చేశాడు. బ్యాట్ ను నేలకేసి బాదబోయాడు గానీ చివరి సెకెన్ లో తమాయించుకున్నాడు. అదే ఫియరీ రియాక్షన్ తో పెవిలియన్ దారి పట్టాడు. 44 బంతుల్లో 81 పరుగులు చేసినప్పటికీ అతని పరుగుల దాహం తీరలేదంటే గేమ్ పై కోహ్లీకి ఉన్న ఇష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ 81 పరుగులతో ఐపీఎల్‌ తో పాటు టీ20 ఇంటర్నేషనల్స్ లల్లో విరాట్ కోహ్లీ అపూర్వమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను భారీ ఇన్నింగ్ ఆడిన ప్రతీసారీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టీమిండియా గెలుస్తూ వచ్చింది. అతను చివరి 14 టీ20 మ్యాచ్‌లలో 50కి పైగా పరుగులు సాధించాడు. ఇది విరాట్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అని మరోసారి స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాలు కోహ్లీ బ్యాటింగ్ నిలకడను జట్టు విజయాలపై అతని ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

చివరి 14 ఇన్నింగ్ లల్లో 51 (43), 70 (44- నాటౌట్), 92 (47), 59 (36-నాటౌట్), 67 (42), 62 (45- నాటౌట్), 73 (54- నాటౌట్), 70 (42), 51 (47), 62 (33), 54 (30), 69 (38- నాటౌట్), 50 (38), 81 (44) పరుగులు చేశాడు కోహ్లీ. ఆయా మ్యాచ్ లల్లో గెలుపురుచి చూశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+