Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs NZ: విరాట్ పొంగల్ థమాకా - ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్..!!

Ind Vs NZ: సంక్రాంతి వేళ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ విరాట్ వైపు చూస్తున్నారు. పండుగ వేళ సరి కొత్త రికార్డుకు విరాట్ అడుగు దూరంలో ఉన్నారు. రాజ్ కోట్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు(బుధవారం) రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. అయితే టీమిండియా ను గాయాల సమస్య వేధిస్తోంది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ విరాట్ వైపు చూస్తుండగా.. వాషింగ్టన్ స్థానంలో తుది అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరమే.

కివీస్ తో మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఈ రోజు జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను పండుగ వేళ గెలిచి క్రికెట్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని భావిస్తోంది. అయితే, టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో మిగిలిన రెండు వన్డేలకు దూరం కావటంతో.. ఆ స్థానంలో ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకున్నారు.

virat-kohli-is-one-big-innings-away-from-setting-a-new-record-as-india-face-nz-in-the-second-odi-at

కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో పడనుంది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకున్నాడు. 91 బంతులు ఎదుర్కొని 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ వరుసగా ఐదు వన్డేల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

దీంతో, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్య రహానేతో సమానంగా నిలి చాడు. విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధ శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచి పొంగల్ వేళ కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. అయితే, రాజ్ కోట్ మ్యాచ్ కు తెలుగు ప్లేయర్ నితీశ్ కు ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారుతోంది. 2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తాయి. దీంతో, నితీష్ కుమార్ రెడ్డి వంటి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లను సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

రాజకోట్ లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని భారత్ అనుకుంటే నితీష్ రెడ్డికి తుది జట్టులో అవకాశం ఉంటుంది. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావాలనుకుంటే మాత్రం బదోనీ అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. రోహిత్ - కోహ్లీ బ్యాటింగ్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+