Virat Kohli horoscope: మహర్జాతకుడే: ఆ డౌట్స్ క్లియర్
ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్ నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాపై పరాజయాన్ని చవిచూసింది. లీగ్స్, సెమీ ఫైనల్స్‌లో ఎదురులేని జట్టుగా నిలిచిన టీమిండియా.. ఫైనల్స్‌లో చతికిలపడటం- దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కప్ గెలుస్తుందనే ఆశలు గల్లంతు కావడం అభిమానులను విషాదంలో ముంచెత్తింది.
టోర్నీ మొత్తం మీద కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్, శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా.. ఇలా ప్లేయర్లందరూ సమష్టిగా సత్తా చాటారు గానీ.. ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్ డిపార్ట్‌మెంట్ విఫలమైంది. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుపులు కనిపించలేదు.

ఈ టోర్నమెంట్ మొత్తం మీద అద్భుతంగా ఆడిన ప్లేయర్.. విరాట్ కోహ్లీ (Virat Kohli). 756 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కలుపుకొని 11 మ్యాచ్‌లను కోహ్లీ ఆడితే అందులో మూడుసార్లు సెంచరీ, ఆరు సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం అతని అత్యుత్తమ ఫామ్‌కు అద్దం పట్టింది.
ఇక మళ్లీ 2027 వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అతని వయస్సు 35 సంవత్సరాలు. అద్భుతమైన ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్ చేస్తోన్నాడు. 2027 వరల్డ్ కప్ నాటికి 39 సంవత్సరాలకు చేరుకుంటాడు. అప్పటికీ ఇదే ఫిట్‌నెస్ ఉంటుందా? ఇదే ఫామ్ కంటిన్యూ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది.
స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ- కోహ్లీ జాతకాన్ని విశ్లేషించింది. కేరీర్, పెళ్లి, సంతానం, ఆదాయం.. ఇలా మొత్తం ఎనిమిది అంశాలపై విశ్లేషణ చేసింది. 2016 ఏప్రిల్ 2వ తేదీన సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోస్ట్ చేసింది స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ. ఇప్పుడా జాతకం వైరల్‌గా మారింది.

2016 నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ కేరీర్ అనాలసిస్‌లో స్టార్ అండ్ ఆస్ట్రాలజీ వేసిన అంచనాలన్నీ దాదాపుగా వాస్తవ రూపాన్ని దాల్చాయి. పెళ్లి, పెళ్లి తరువాత అతని దశ ఎలా తిరిగింది.. అనే అంశాలన్నీ నిజం అయ్యాయని తెలిపింది.
ఈ హారోస్కోప్ ప్రకారం చూసుకుంటే- 2025 ఆగస్టు వరకు కోహ్లీ కేరీర్ గ్రాఫ్ అత్యున్నతంగా ఉంటుంది. ఆగస్టు నుంచి కొంత డౌన్ ఫాల్ కనిపిస్తుంది. 2027 ఫిబ్రవరి వరకూ అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వొచ్చు. ఆ తరువాత మళ్లీ అతని కేరీర్ పికప్ అవుతుంది. మరో ఏడాది పాటు సుదీర్ఘ క్రికెట్‌ను ఆడతాడు కోహ్లీ. 2028 మార్చిలోగా రిటైర్ అవుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతాడు.












Click it and Unblock the Notifications