ముఖంపై గాయాల‌తో విరాట్‌కోహ్లీ... వైర‌ల్ అవుతోన్న పోస్ట్‌...

ప్రపంచ‌క‌ప్ ముగిసింది ఇప్పుడు ఐపిఎల్ 2024 స‌మరానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు స‌మాచారం. వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ప‌రుగుల రారాజు విరాట్‌కోహ్లీ రికార్డుల మోత మోగించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అయితే, తాజాగా కోహ్లీ చేసిన ఓ పోస్ట్ సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజితో ఉన్న ఫోటోను విరాట్‌కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను చూసిన నెటిజ‌న్సు మాత్రం కోహ్లీకి ఏమైందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ తెల్ల‌టి టీ ష‌ర్ట్ ధ‌రించి ఉన్నాడు. ముఖంపై గాయాల‌తో, ముక్కుకు బ్యాండేజ్ వేసుకుని క‌నిపిస్తారు. అయితే, ముఖంపై గాయాలున్న చిన్న చిరున‌వ్వును చిందిస్తూ ఉన్న ఫోటోను కోహ్లీ పోస్ట్ చేయ‌డం జ‌రిగింది. ఇందులో ఉండే అవ‌త‌లి వ్య‌క్తిని కూడా మీరు చూడాలంటూ కోహ్లీ ఈ పోస్ట్‌కు రాయ‌డం జ‌రిగింది. దాంతో ఈ ఫోటోలో ఏదో మిస్టరీ దాగి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ ఫోటోలోని కోహ్లీ చిరున‌వ్వును చూసి అత‌ని అభిమానులు కాస్త ఊపీరి పిల్చుకున్నారు.

 Virat Kohli with facial injuries... post going viral...

అప్ప‌ట్లో ఆర్సీబీని వ‌దిలేయాల‌నుకున్న విరాట్‌ : ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు స‌మాచారం. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీల రిటైన్‌, రిలీజ్‌ జాబితాలు ప్రకటించిన అనంత‌రం కోహ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్‌ కూడా విరాట్ కోహ్లీనే కావ‌డం విశేషం. అలాంటి విరాట్‌ కూడా ఒకప్పుడు ఆర్సీబీని వదిలేయాలనుకున్నాడు.

కోహ్లీ అప్పుడు జరిగిన చిట్‌చాట్‌లో ఏం మాట్లాడాడో ఓసారి చూద్దాం...మనకు తెలిసి ట్రోఫీలు గెలిచిన గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నా కానీ, ఎవరూ మిమ్మల్ని ఇతను ఐపీఎల్‌ ఛాంపియన్‌ లేదా వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌' అని పిలవరని కోహ్లీ ఆ చిట్‌చాట్‌లో చెప్ప‌డం జ‌రిగింది. నువ్వు మంచి వ్యక్తివైతే.. ప్రజలూ నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే వారే దూరంగా పెడతారని, జీవితంలో ఇదే అత్యంత విలువైందని అందుకే ఆర్సీబీని వీడలేదని అప్ప‌ట్లో కోహ్లీ అన్నాడు. అందుకే ఆర్‌సీబీ పట్ల విరాట్ కోహ్లీ విధేయతగా ఉండటానికి కార‌ణమ‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+