KKR vs RCB: కోల్‌కతాకు షాక్.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ బోణీ
KKR vs RCB: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కు షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025ను విజయంతో ప్రారంభించింది. ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో తన వేటను ప్రారంభించింది. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో కోల్‌కతాపై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ 17 సంవత్సరాల తన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్ మొదటి సీజన్ తొలి మ్యాచ్ కూడా ఈ జట్ల మధ్యనే జరిగింది. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ(59*), ఫిల్ సాల్ట్(56) రాణించారు. రజత్ పటీదార్(34) పరుగులు చేశాడు. ఆర్సీబీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 17వ ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలోసునీల్ నరైన్ ఓపెనర్‌గా 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, అజింక్య రహానె 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ 56 పరుగులు చేయగా, అంగ్క్రిష్ రఘువంశీ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ తరఫున కృనాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీసి డిఫెండింగ్ ఛాంపియన్లను 200 పరుగుల మార్కుకు చాలా దూరంలో నిలిపాడు.

అద్భుత ఆరంభాన్ని అందించిన విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్
ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఆరంభాన్ని కేకేఆర్ ఊహించారు. గత సీజన్ లో కేకేఆర్ లో భాగమైన ఫిల్ సాల్ట్ జట్టులోకి రాగానే బౌలర్లను ఆడుకున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోరు 80 పరుగులు. సాల్ట్ కేవలం 25 బంతుల్లోనే తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ కూడా 30 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 17వ ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా ఆర్సీబీ గెలుపు తీరాలకు చేరింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే.
FIRST WIN FOR RCB AGAINST KKR SINCE 2022 IPL 🤯 pic.twitter.com/2OvJoO8r8R
— Johns. (@CricCrazyJohns) March 22, 2025












Click it and Unblock the Notifications