Virat Kohli: భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లీ.. అడుగు దూరంలో అరుదైన ఘనతలు!
Virat Kohli: ఐపీఎల్ 2025 సీజన్ నేడు(మార్చి 22) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. 17 ఏళ్ల క్రితం టోర్నమెంట్ మొదటి సీజన్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ 18వ సీజన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ ముంగిట ఐదు రికార్డులు ఉన్నాయి. ఆ 5 రికార్డుల గురించి తెలుసుకుందాం.
టీ20 ఫార్మాట్ లో 13 వేల పరుగులు
ఐపీఎల్ 2025 విరాట్ కోహ్లీకి చాలా గొప్పగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ తన పేరు మీద అనేక రికార్డులు సృష్టించగలడు. వాటిలో ఒకటి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేయడం. టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 12886 పరుగులు చేశాడు. 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కు ఇంకా 114 పరుగులు అవసరం. విరాట్ కోహ్లీ కేకేఆర్ పై సెంచరీ సాధిస్తే.. 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లోనే కోహ్లీ 13 వేల పరుగులను పూర్తి చేయగలడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ టీ20 క్రికెట్ లో 14562 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసి రికార్డు
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 18వ సీజన్ లో విరాట్ రెండో అతిపెద్ద లక్ష్యం 50+ స్కోర్లు సాధించడం. ఐపీఎల్ లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన రికార్డు ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. డేవిడ్ వార్నర్ 66 సార్లు 50+ స్కోర్లు చేశాడు. కోహ్లీ 63 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. ఈ నేపథ్యంతో వార్నర్ రికార్డును అధిగమించడానికి మరో 5 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాల్సి ఉంటుంది.
టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీకి టీ20 పార్మాట్ లో సెంచరీల పరంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అధిగమించే అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 క్రికెట్ లో మొత్తం 9 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో బాబర్ ఆజం ఈ ఫార్మాట్ లో 11 సెంచరీలు చేయగా.. క్రిస్ గేల్ 22 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కనీసం బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ 1000 బౌండరీలు పూర్తి చేయగలడు
ఐపీఎల్ 18వ సీజన్ లో విరాట్ కోహ్లీ బౌండరీలు బాది భారీ రికార్డును సృష్టించగలడు. ఈ సారి విరాట్ కోహ్లీ 1000 బౌండరీల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ లో విరాట్ ఇప్పటివరకు 977 బౌండరీలు బాదాడు. ఆ బౌండరీల 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో 1000 బౌండరీలను సాధించాలంటే కేవలం 22 బౌండరీలు మాత్రమే అవసరం.
ఐపీఎల్ లో 150 క్యాచ్‌లు పూర్తి చేయగలడు
ఐపీఎల్ లో ఔట్ ఫీల్డ్ క్యాచ్ లు పట్టడంలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 252 మ్యాచ్‌లలో 114 క్యాచ్ లు పట్టాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్ తో 18వ సీజన్ లో 150 క్యాచ్ లు పట్టిన రికార్డును విరాట్ దాటే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications