విసాల వ్యవహారంలో నలుగురు పాకిస్తాన్ సంతతి క్రికెటర్లకు భారత్ బిగ్ షాక్.. !!
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించిన తర్వాత పలు కీలక పరిణామలు చోటు చేసుకుంటోన్నాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఆడటానికి భారత్ రాకూడదని ఆ దేశ క్రికెట్ బోర్డ్ నిర్ణయించింది. ఆ జట్టు ఆడాల్సిన నాలుగు మ్యాచ్ లు కూడా శ్రీలంకకు రీలొకేట్ కానున్నాయి. దీనిపై ఐసీసీ వరల్డ్ కప్ వెన్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. దీంతో పాటు తమదేశంలో ఐపీఎల్ ప్రసారాలన్నింటినీ కూడా నిలిపివేయాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది.
ఈ పరిణామాల మధ్య- పాకిస్తాన్ సంతతికి చెందిన నలుగురు అమెరికా క్రికెటర్లు- అలీ ఖాన్, షాయాన్ జహంగీర్, మహ్మద్ మోహసిన్, ఎహ్‌సాన్ ఆదిల్ కు బిగ్ షాక్ తగిలింది. అమెరికా తరఫున ఆడుతున్న ఆ క్రికెటర్లకు ఇంకా భారత వీసాలు లభించట్లేదు. భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం వీసా క్లియరెన్స్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో యూఎస్‌ఏ జట్టుతో కలిసి ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న ఈ నలుగురు ప్లేయర్లు.. కొలంబోలోని భారత హైకమిషన్‌లో వీసా అపాయింట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేశారు.

అపాయింట్‌మెంట్ దశలో వీసాలు జారీ కాలేదు. అలాగని- ఆ దరఖాస్తులను అధికారికంగా తిరస్కరించలేదని రాయబార కార్యాలయం తెలిపింది. సాధారణ కార్యనిర్వహణ ప్రక్రియల్లో భాగంగా ఆయా దరఖాస్తులన్నీ కూడా ఇంకా పరిశీలనలో దశ ఉన్నాయని వివరించింది. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంటేషన్లు వాళ్లు పూర్తి చేశారని, అపాయింట్‌మెంట్ సమయంలో వీసాలను ప్రాసెస్ చేయలేమని ఆటగాళ్లకు తెలియజేశామని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అదనపు సమాచారం ఇంకా రావాల్సి ఉందని తెలిపింది.
పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆటగాళ్లకు వారి జాతీయతతో సంబంధం లేకుండా వీసా సమీక్షలకు అదనపు పరిపాలనా ప్రక్రియలు అవసరమవుతాయి. గతంలో మోయిన్ అలీ, షోయబ్ బషీర్, ఉస్మాన్ ఖవాజా వంటి క్రికెటర్లు కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. ఈ దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయని, తుది అనుమతులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ సహా ఎక్కువ సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి.
వరల్డ్ కప్‌లో ఆడబోయే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఒమన్, ఇటలీ వంటి దేశాల జట్లలోని పాకిస్తానీ సంతతికి చెందిన ఆటగాళ్లకు కూడా ఇదే విధమైన ప్రోటోకాల్‌లు వర్తిస్తాయి. భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ అయిష్టత చూపడం వంటి పరిణామాలతో ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ వార్తల్లోకెక్కింది. ఇక పాకిస్తాన్ సంతతికి చెందిన క్రికెటర్లకు భారత్ లో విసాల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడం దీన్ని మరింత వివాదంలోకి నెట్టినట్టయింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications