గంగూలీకి బెంగాల్ ప్రభుత్వం షాక్, ఏం జరుగుతోంది..!!

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూనే... రాజకీయంగా మమతను ఫిక్స్ చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలను అధికారులు వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను తగ్గించింది. ఆయనకు ఇంతకుముందు ఇస్తున్న 'జెడ్' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుని, 'వై' (Y) కేటగిరీకి కుదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా విభాగం తాజాగా ప్రకటించింది. గంగూలీ భద్రత గురించి పునఃసమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర భద్రతా విభాగ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023లో మమతా బెనర్జీ సర్కార్ గంగూలీకి ఉన్న 'వై' కేటగిరీ భద్రత నుంచి 'జెడ్' కేటగిరీకి పెంచింది. జెడ్ కేటగిరీ ఉన్నంత కాలం గంగూలీకి 8 నుంచి10 మంది పోలీసు సిబ్బంది రక్షణ ఉండేది. ఇప్పుడు వై కేటగిరీకి తగ్గించడంతో ఆయనకు భద్రత కల్పించే పోలీసుల సంఖ్య కూడా తగ్గనుంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ ప్రముఖలకు సంబంధించిన భద్రతపై అధికారులు సమీక్షించారు.

పార్టీ వీడకుంటే.. అన్నామలై కు బీజేపీ బంపరాఫర్- కీలక మలుపు..!!
పార్టీ వీడకుంటే.. అన్నామలై కు బీజేపీ బంపరాఫర్- కీలక మలుపు..!!
west-bengal-government-has-downgraded-the-security-cover-provided-to-former-india-cricket-captain-so

నిర్ణయం పై అధికారుల స్పష్టత

కాగా, కొత్త భద్రతా నిబంధనల ప్రకారం.. గంగూలీకి ఉన్న ముప్పు 'జెడ్' కేటగిరీ భద్రత కిందకు రాదని స్పష్టం చేస్తున్నారు. గంగూలికి అవసరమైన పోలీసు భద్రత కొనసాగుతున్నప్పటికీ, 'Z' కేటగిరీ కింద కేటాయించిన విస్తృతమైన వీఐపీ కార్డన్, హోంగార్డులు, ప్రత్యేక వ్యక్తిగత భద్రతా అధికారుల (పీఎస్‌ఓల) సంఖ్యను తగ్గించారు. గంగూలీ భద్రత తగ్గింపు అనేది కేవలం ఒక ప్రత్యేక నిర్ణయం కాదని, రాష్ట్రవ్యాప్తంగా వీఐపీ భద్రతా నిబంధనల పునర్వ్యవస్థీకరణలో భాగమేనని రాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించవద్దని సూచించారు. ఇక.. రాజకీయంగానూ కీలక నిర్ణయాలు జరుగుతన్నాయి. మమతా పార్టీలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు సొంత కుంపటికి సిద్దమయ్యారు. వారంతా టీఎంసీ చీలక వర్గంగా కొనసాగుతున్నారు. తమదే అసలైన టీఎంసీ అని చెబుతూనే.. తమ టీం నుంచే కొత్త ప్రతిపక్ష నేతను ప్రతిపాదించారు. దీంతో.. రాజకీయంగా రాష్ట్రంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+