Sachin - Shami: వాట్ ఏ "షమీ" ఫైనల్ - బిగ్ టర్న్, సచిన్ ఫిదా..!!

మహ్మద్ షమీ ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ జపిస్తున్న పేరు. ప్రపంచ కప్ సెమీస్ లో న్యూజీలాండ్ పైన గెలిచిన టీమిండియా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. భారత్ గెలుపు కంటే విరాట్ 50వ సెంచరీ, షమీ బంతితో చేసిన విన్యాసం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి అనుభూతి పంచింది. షమీ ఏడు వికెట్లు తీసి సెమీ ఫైనల్ నుంచి షమీ ఫైనల్ గా మార్చేసాడు. టీమిండియా కు ఫైనల్స్ కు రూట్ క్లియర్ చేసాడు. షమీ పైన ఇప్పుడు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అవకాశంగా మలచుకొని:షమీ సామర్ధ్యం పైన తొలుత అనుమానాలతో నాలుగు మ్యాచ్ లకు దూరం పెట్టారు. కానీ, అవకాశం వస్తూనే షమీ తానెంటో టీం మేనేజ్మెంట్ చేసిన పొరపాటు ఏంటో అర్దమయ్యేలా చేసాడు. ఇదీ తన సత్తా అని నిరూపించాడు. తొలి మ్యాచ్ నుంచి చెలరేగిపోతున్న షమీ సెమీ ఫైనల్ లో న్యూజీలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడు వికెట్ అవసరమైతే అప్పుడు షమీ ఉన్నాడనేది కెప్టెన్ రోహిత్ నమ్మకం. కెప్టెన్ నుంచి బంతి అందుకోవంతో వికెట్ తీసి షమీ తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సెమీస్ లో ధీటైన జవాబు ఇస్తున్న కివీస్ బ్యాటర్లను షమీ పెవిలియన్ బాట పట్టించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చసాడు.

What a Shami-final: cricket legend Sachin Tendulkar hailed Shami for his seven-wicket spell

షమీపై ప్రశంసలు:ఇక, షమీ బౌలింగ్ కు ఫ్యాన్స్ తో పాటుగా క్రికెట్ దిగ్గజాలు మురిసిపోయాయి. మ్యాచ్ ఆసాంతం తన ఆధిపత్యం కొనసాగించిన షమీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది సెమీ ఫైనల్ కాదని షమీ-ఫైనల్ అని చమత్కరించాడు. అటూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణించిన టీమిండియాను అభినందించాడు. అటు సచిన్ సమక్షంలోనే విరాట్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. 50వ సెంచరీ నమోదు చేసాడు. దీని పైన సచిన్ ప్రశంసలు గుప్పించాడు. బౌలింగ్ విభాగంలో షమీ ఒంటి చేత్తో కివీస్ పైన ఆధిపత్యం సాధించాడు. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే సెమీస్ లో రెండు హేమా హేమీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎప్పటికీ నిలిచిపోయేలా చేసారు.

రికార్డులు అధిగమిస్తూ:కాగా, ఈ వరల్డ్ కప్‌లో షమీ నాలుగుపర్యాయాలు ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మిచెల్ ప్రపంచకప్‌ మ్యాచుల్లో మూడు సార్లు ఐదు, అంతకుమించి వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా, ప్రపంచకప్‌‌ మ్యాచుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మిచెల్ స్టార్క్ ఇటీవల ఈ టోర్నీలోనే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. మిచెల్ 19 ప్రపంచకప్ వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీయగా షమీ 17 మ్యాచులకే ఈ ఫీట్ సాధించాడు. ఇక, ఇప్పుడు అహ్మదాబాద్ లో ఈ నెల 19న జరిగే ఫైనల్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+