పీవీ సింధు తన పెళ్లి కార్డు మొదటగా ఎవరికిచ్చిందో తెలుసా..?
భారతదేశపు బ్యాడ్మింటన్ రాణి, ఓలింపిక్ పతక విజేత పీవీ సింధు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తన జీవితంలోని కొత్త అధ్యాయానికి అడుగుపెట్టడానికి పీవీ సింధు రెడీ అవుతోంది. పీవీ సింధు పెళ్లి అనౌన్స్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకోనుంది. 2024 డిసెంబర్ 22న, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం జరుగనుంది. అంగరంగ వైభవంగా ఈ వివాహం జరపడానికి ఇరు కుటుంబాలు కూడా సన్నద్ధం అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయాలతో కూడిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు క్రీడా ప్రముఖులు పాల్గొనున్నారు. ఇదిలా ఉంటే భారత సంప్రదాయంలో పెళ్లి కార్డును మొదట దేవుడు దగ్గర పెడతారు. కానీ పీవీ సింధు మాత్రం ఎవరూ ఊహించని వ్యక్తికి తన పెళ్లి తొలి కార్డు అందించి అందరికి షాకిచ్చింది. సింధు తన తొలి వివాహ ఆహ్వాన కార్డును క్రికెట్ దేవుడుగా పిలిచే సచిన్‌కు అందజేసింది. పీవీ సింధు తనకు కాబోయే భర్తతో కలిసి ఆదివారం ముంబై వెళ్లి సచిన్ కుటుంబాన్ని కలిశారు.ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తెలియజేశారు.సింధు తనను కలిసిన ఫొటోను సచిన్ ట్వీట్ చేశారు. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపారాయన.

వరుడు ఎవరు?
వెంకట దత్త సాయి, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. పీవీ సింధు మరియు వెంకట దత్త సాయిల వివాహం రెండు కుటుంబాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే వీరిద్దరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. ఈ వివాహానికి స్పోర్ట్స్‌కు సంబంధించిన వారితో పాటు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.24న హైదరాబాద్‌లో రెండు కుటుంబాలు రిసెప్షన్ ఏర్పాటు చేశాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications