Ind Vs SA: వర్షంతో ఫైనల్ రద్దయితే విజేత ఎవరు - రూల్స్ క్లియర్..!!
T20 World Cup 2024 Final India Vs SA : టీ20 ప్రపంచ కప్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ కు చేరింది టీమిండియా. కప్ గెలవడమే లక్ష్యంగా మెగా టోర్నీకి వచ్చిన భారత జట్టు వరుస విజయాలతో ఒక్క అడుగుదూరంలో ఉంది. అన్ని విభాగాల్లో దూకుడు మీదఉన్న రోహిత్ సేనతో ధీటుగా తలపడేందుకు సౌతాఫ్రికా సిద్దమైంది. ఫైనల్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా పైనల్ జరగకపోతే విజేత ఎవరు. రూల్స్ ఏం చెబుతున్నాయి.
టైటిల్ పోరు పై ఉత్కంఠ
టీ 20 ప్రపంచ కప్ లో రోహిత్ సేత ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ తో అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఫైనల్స్ లో అడుగ పెట్టింది. 29న ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, వాతావరణం మాత్రం టెన్షన్ పెడుతోంది. ఫైనల్ బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల 30 నిముషాలకు ప్రారంభంకానుంది. భారత కాలమానం ప్రకారం అయితే రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఫైనల్ డే నాడు వర్షం ఖాయమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

పొంచి ఉన్న వాన గండం
జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. బార్బడోస్‌లో తెల్లవారుజామున 3 గంటల నుండి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉదయం 11 గంటలకు తుపానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టాస్ వేసినా మ్యాచ్‌ని మధ్యలోనే ఆపేయడం ఖాయం.
వర్షం కురిస్తే విజేత ఎవరు
మరోవైపు.. 12 నుంచి 3 గంటల వరకు వర్షం కురిసే అవకాశం 40 శాతం లోపే ఉందని, అలాంటి పరిస్థితుల్లో సకాలంలో గ్రౌండ్ గా పూర్తిగా ఆరిపోతే మ్యాచ్‌ని పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్ డేని ఉంచింది. జూన్ 29న మ్యాచ్ పూర్తి కాకపోతే.. జూన్ 30న ట్రోఫీ కోసం రెండు జట్లూ బరిలో తలపడొచ్చు. రిజర్వ్ రోజున కూడా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ పూర్తి కాకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా నిలిచాయి. టైటిల్ పోరులో ఆడి రోహిత్ సేన గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి..వాతావరణం అనుకూలిస్తుందా లేదా...ఏం జరుగుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications