MI vs CSK: నల్ల రిబ్లన్లతో చెన్నై ఆటగాళ్లు.. ఎందుకంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఆటగాళ్లంతా చేతులకు బ్లాక్ బ్యాండ్స్ ధరించి కనిపించారు.
తమ బౌలర్ ముఖేష్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి మృతికి సంతాపంగా ఆటగాళ్లంతా ఈ బ్లాక్ బ్యాండ్స్ ధరించినట్లు సీఎస్‌కే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'ఇది ముఖేష్ తల్లి కోసం. ఆమె జ్ఞాపకార్థం, ముఖేష్‌కు సంఘీభావం తెలుపుతూ.. ఈ రోజు మేం నల్ల బ్యాండ్స్ ధరించి ఆడుతున్నాం.'అని సీఎస్‌కే ట్వీట్ చేసింది.
గతేడాది కాలంగా అనారోగ్యంతో బాధపడిన ముఖేష్ చౌదరి తల్లి ముంబైలోని టాటా ఆస్పత్రిలో గత మంగళవారం(ఏప్రిల్ 21) తుది శ్వాస విడిచారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించగా.. ముఖేష్ వాటిని ముగించుకుని బుధవారం రాత్రి జట్టులో చేరి తాజా మ్యాచ్ బరిలోకి దిగాడు.

ఈ కష్ట కాలంలో ముఖేష్ చౌదరికి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖేష్‌కు మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా.. ధోనీ వ్యక్తిగతంగా ఆస్పత్రికి వెళ్లి అతని తల్లిని పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ముఖేష్ చౌదరి నేరుగా తన స్వగ్రామం భిల్వారాకు వెళ్లాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైనప్పటికీ.. ముఖేష్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర బ్యాటర్లను వరుస బంతుల్లో ఔట్ చేసి సత్తా చాటాడు. ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ముంబైతో మ్యాచ్‌లోనూ తన తొలి ఓవర్‌లోనే ముఖేష్ చౌదరి వికెట్ పడగొట్టాడు. డేంజరస్ క్వింటన్ డికాక్(7)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. సంజూ శాంసన్(54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 నాటౌట్) ఒక్కడే అజేయ శతకంతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్(2/37), అల్లా ఘజన్‌ఫర్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
This one is for Mukesh’s mother.
— Chennai Super Kings (@ChennaiIPL) April 23, 2026
In her memory and in solidarity with Mukesh, we wear black armbands and play with a little more in our hearts today. pic.twitter.com/OKk6bmPK4e












Click it and Unblock the Notifications