సో సోగా భారత్ బ్యాటింగ్.. బౌలింగ్ తో మ్యాజిక్ చేసి కివీస్ ని కట్టడి చేస్తారా ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, కివీస్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముందుగా భారత్ బ్యాటింగ్ కి దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. దీంతో న్యూజిలాండ్ టీంని చిత్తు చేసేందుకు టీమిండియా బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తుందా అని అందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గిల్ (2) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌తో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. గ్లెన్‌ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్‌ (42) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 98 పరుగులు చేయడం ప్లస్ అయ్యింది.

will India do magic with bowling to win against newzealand

ఇక శ్రేయాస్, అక్షర అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 45 రన్స్ చేసి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో 249/9తో భారత్‌.. ఇన్నింగ్స్‌ను ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. కైల్ జెమీసన్, విలియమ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇప్పటికే గ్రూప్‌-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు ఏ మాత్రం మ్యాజిక్ చేస్తారో అని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+