SRH ప్లే ఆఫ్స్ ఛాన్స్​- క్వాలిఫై అవ్వాలంటే, ఇలా జరగాలి..!!

IPL 2025: ఐపీఎల్ కీలక దశకు చేరింది. ప్లే ఆఫ్స్ కు చేరే జట్ల పైన స్పష్టత వస్తోంది. తొలి నాలుగు టీం లకే ప్లే ఆఫ్స్ అవకాశం దక్కనుంది. చెన్నై కు ఇక నో ఛాన్స్. మరి సన్ రైజర్స్ పరిస్థితి ఏంటి. ఆరెంజ్ ఆర్మీకి ఇంకా అవకాశం ఉందా. ప్రస్తుతం టీంలు.. పాయింట్లు పరిశీలిస్తే సన్ రైజర్స్ కు ఛాన్స్ ఇంకా ఉంది. అయితే, అంత ఆషా మాషీ కాదు. పక్కా ప్లానింగ్ అవసరం. లెక్క కట్టి మరీ ఆడితేనే సాధ్యం. ఇంతకీ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి..

సన్ రైజర్స్ కు ఛాన్స్
ఈ సారి ఐపీఎల్ లో తొలుత అదరగొట్టిన సన్ రైజర్స్ తరువాత ఊహించని అపజయాలను మూట గట్టుకుంది. తాజాగా గుజరాత్ తో ఓడి ఏడో ఓటమి చవి చూపింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే చెన్నై, రాజస్థాన్ ఔట్ అయ్యాయి. అయితే ఈ రేసులో సన్​రైజర్స్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆరెంజ్ ఆర్మీ జర్నీ ఇంకా ముగియలేదు. ఇప్పటి వరకు సన్ రైజర్స్ 10 మ్యాచ్​లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్​ల్లో నెగ్గగా, ఏడింట్లో ఓడిపోయింది. ప్రస్తు తం ఆరెంజ్ ఆర్మీ 6 పాయింట్ల (-1.192 నెట్​రన్​ రేట్​) తో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ ఈ సీజన్​లో ఇంకా 4 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది.

will-sunrisers-hyderabad-qualify-for-the-playoffs-in-ipl-2025

ఇలా జరిగితే
సన్ రైజర్స్ టాప్- 4లో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్ ల్లో కచ్చితంగా విజయం సాధించా ల్సిందే. అప్పుడే 7 విజయాలు 14 పాయింట్లతో టాప్​ 4 రేస్ లో నిలుస్తుంది. గతంలో అనేకసార్లు 14 పాయింట్లతో పలు జట్లు ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించాయి. ఈ లెక్కన ఈసారి సన్ రైజర్స్ ​ కూడా అలాగే టాప్​లో నిలిచే ఛాన్స్ ఉంది. కాగా, సన్ రైజర్స్ నెట్​ రన్​రేట్ (-1.192) ఘోరంగా ఉంది. అందుకే హైదరాబాద్​కు భారీ విజయాలు అవసరం. అలాగే మూడు కంటే ఎక్కువ జట్లు 14కు మించి ఎక్కువ పాయింట్లు సంపాదించకూడదు. అప్పుడే సన్​రైజర్స్ 14 పాయింట్లతో టాప్ 4లో ఉంటుంది. ఇక్కడ నెట్​రన్​ రేట్​ అత్యంత కీలకం. రన్ ​రేట్​ మెరుగ్గా లేకపోతే అసాధ్యం. ఈ లెక్కన హైదరాబాద్​ ఇతర జట్ల ఫలితాలపైనా ఆధారపడాల్సి ఉంటుంది.

ఆర్సీబీనే స్పూర్తి
అగ్రస్థానంలో కొనసాగుతున్న ముఖ్యంగా ముంబయి, ఆర్సీబీ, గుజరాత్, పంజాబ్​ తదుపరి మ్యాచ్​ల ఫలితాలు సన్ రైజర్స్ క్వాలిఫైయింగ్ అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్​లు దిల్లీ, కోల్​కతా, ఆర్సీబీ, లఖ్​నవూ జట్లతో తలపడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్​లో ఓడినా సన్ రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గతేడాది ఆర్సీబీ ఒక్క శాతం ఛాన్స్​ను కూడా వదలకుండా పోరాడి టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇదంతా జరగటం కష్టమే అనిపిస్తున్నా గతంలో ఆర్సీబీ దూసుకొచ్చిన తీరును స్పూర్తిగా తీసుకుంటే అసాధ్యమేమీ కాదు. మరి..ఈ లెక్కలను నిజం చేస్తూ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+