అదరగొట్టిన న్యూజిలాండ్: సెంచరీ బాదిన స్టార్ బ్యాటర్- టీమిండియాకు భారీ టార్గెట్

భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ అదరగొట్టింది. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక్కడి మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ విల్ యంగ్ అద్భుత శతకంతో చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రీజ్ లో పాతుకుపోయి భారీ షాట్లు ఆడాడు.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు టీమిండియా కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ప్రారంభంలో బ్యాటర్లు ధాటిగా పరుగులు రాబట్టారు. విల్ యంగ్ విరుచుకుపడటంతో రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. ఆరంభం నుంచే బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ వచ్చాడు. 108 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి పునాది వేశాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 58 మెరుపు బ్యాటింగ్ చేశాడు.

Will Young shine with a century and Tim Seifert 58 in 4th ODI on India as New Zealand Puts 334 chase

ఆ తర్వాత వచ్చిన ఫిన్ అలెన్ కూడా ధాటిగా ఆడి 30 బంతుల్లో 41 పరుగులు చేయడంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు పడ్డాయి గానీ లోయర్ ఆర్డర్ లో కేప్టెన్ మిఛెల్ శాంట్నర్- 24, క్రిస్టియన్ క్లార్క్- 22, కైల్ జేమీసన్- 19 నాటౌట్ రాణించడంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు 300 దాటింది. చివరి ఓవర్ చివరి రెండుబంతులకూ రెండు వికెట్లు పడ్డాయి. 50 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 333 పరుగులకు ఆలౌట్ అయింది.

స్కూల్ పిల్లలకు కేకులు, గ్రీటింగ్ కార్డులు పంచిన సీఎం విజయ్
స్కూల్ పిల్లలకు కేకులు, గ్రీటింగ్ కార్డులు పంచిన సీఎం విజయ్

ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ సత్తా చాటారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్- 2, ఆకిబ్ నబీ- 2, గుర్నూర్ బ్రార్- 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చారు. స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ 8 ఓవర్లలోనే 73 పరుగులు సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్‌లకు ఒక్కో వికెట్ లభించింది.

బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్
బంగారం ధరల్లో హ్యూజ్ క్రాష్

బే ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరిస్తుండటంతో 334 పరుగుల లక్ష్య ఛేదన భారత జట్టుకు అత్యంత కీలకమైనదిగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. టీమిండియా టాప్ ఆర్డర్ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తే ఈ కొండంత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమౌతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+