World Cup 2023, IND vs PAK: డాషింగ్ ఓపెనర్ ఈజ్ బ్యాక్- పాక్ బౌండరీల జోరు..!!
అహ్మదాబాద్: ప్రపంచ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ మొదలైంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షమందికి పైగా అభిమానుల మధ్య ఈ పోరు ఆరంభమైంది. మ్యాచ్‌కు మించి అనిపించేలా జరిగే ఈ గేమ్‌లో విజయం సాధించడానికి రెండు జట్లు పోరాడుతున్నాయి.
ఈ మ్యాచ్ టీమిండియా టాస్ గెలిచింది. ఏ మాత్రం ఆలోచించకుండా జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఇమాముల్ హక్ ఇన్నింగ్ ఆరంభించారు. తొలి ఓవర్ తొలి అయిదు బంతులను ఎదుర్కొనడంలో ఇబ్బందులు పడ్డాడు అబ్దుల్లా షఫిక్, చివరి బంతికి మాత్రం ఫోర్ బాదాడు.

జస్‌ప్రీత్ బుమ్రా సంధించిన ఓవర్ అది. బుమ్రా వేసిన ఓవర్‌పిచ్ బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. అప్పటివరకూ మారుమోగిన స్టేడియం మొత్తం ఆ షాట్‌కు మూగబోయింది. ఆ తరువాత కూడా పాకిస్తాన్ జోరుకు బ్రేకులు పడలేదు. బౌలర్ బారినా బౌండరీల సంఖ్య మాత్రం తగ్గలేదు.
మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లోనూ భారీగా పరుగులు పిండుకున్నారు పాక్ ఓపెనర్లు. ఇమాముల్ హక్ వరుసగా బౌండరీలు సాధించాడు. 1,2,4 బంతులను లైన్ దాటించాడు. దీనితో పాక్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోర్ 16 పరుగులకు చేరింది.
టీమిండియాలో డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రీ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొన్నటివరకు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడిన గిల్.. పాకిస్తాన్‌పై జరిగే మ్యాచ్‌కు తుదిజట్టులో స్థానం దక్కించుకోగలిగాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో అతన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకుంది మేనేజ్‌మెంట్.
తుదిజట్టులో- రోహిత్ శర్మ(కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు. పాక్‌లో- అబ్దుల్లా షఫీక్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications