World Cup 2023, IND vs PAK: సిరాజ్ అండర్ అటాక్: బ్యాక్ అండ్ బ్యాక్ బౌండరీలు: ఏకి పడేస్తోన్న ఫ్యాన్స్
అహ్మదాబాద్: ప్రపంచ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ మొదలైంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షమందికి పైగా అభిమానుల మధ్య ఈ పోరు ఆరంభమైంది. మ్యాచ్‌కు మించి అనిపించేలా జరిగే ఈ గేమ్‌లో విజయం సాధించడానికి రెండు జట్లు పోరాడుతున్నాయి.
ఈ మ్యాచ్ టీమిండియా టాస్ గెలిచింది. ఏ మాత్రం ఆలోచించకుండా జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఇమాముల్ హక్ ఇన్నింగ్ ఆరంభించారు. తొలి ఓవర్ తొలి అయిదు బంతులను ఎదుర్కొనడంలో ఇబ్బందులు పడ్డాడు అబ్దుల్లా షఫిక్, చివరి బంతికి మాత్రం ఫోర్ బాదాడు.

జస్‌ప్రీత్ బుమ్రా సంధించిన ఓవర్ అది. బుమ్రా వేసిన ఓవర్‌పిచ్ బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. అప్పటివరకూ మారుమోగిన స్టేడియం మొత్తం ఆ షాట్‌కు మూగబోయింది. ఆ తరువాత కూడా పాకిస్తాన్ జోరుకు బ్రేకులు పడలేదు. బౌలర్ బారినా బౌండరీల సంఖ్య మాత్రం తగ్గలేదు.
మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లోనూ భారీగా పరుగులు పిండుకున్నారు పాక్ ఓపెనర్లు. ఇమాముల్ హక్ వరుసగా బౌండరీలు సాధించాడు. 1,2,4 బంతులను లైన్ దాటించాడు. దీనితో పాక్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోర్ 16 పరుగులకు చేరింది.
ఫోర్ల వర్షం ఆ తరువాత కూడా ఆగలేదు. మహ్మద్ సిరాజ్ వేసిన తన రెండో ఓవర్ తొలి బంతి కూడా బౌండరీ లైన్ దాటింది. సిరాజ్ వేసిన వైడ్- ఫుల్లర్‌ను కవర్స్ మీదుగా ఫోర్ సాధించాడు షఫిక్. మొత్తంగా తన రెండు ఓవర్ల కోటాలో 18 పరుగులను సమర్పించుకున్నాడీ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్.
అది కాస్తా అభిమానులను తీవ్ర నిరాశకు, ఆగ్రహానికీ గురి చేసింది. అతనిపై మీమ్స్ మొదలు పెట్టారు కూడా. తొలి రెండు ఓవర్లు ముగిసే సమయానికే అతని పేరు Siraj సోషల్ మీడియాలో ట్రెండ్రింగ్ అయిందంటే- ఫ్యాన్స్ ఏ స్థాయిలో అతని మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారనేది అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications