World Cup 2023, IND vs PAK: పెద్ద పొరపాటే చేసిన విరాట్ కోహ్లీ..!!
అహ్మదాబాద్: ప్రపంచ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ మొదలైంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షమందికి పైగా అభిమానుల మధ్య ఈ పోరు ఆరంభమైంది. మ్యాచ్‌కు మించి అనిపించేలా జరిగే ఈ గేమ్‌లో విజయం సాధించడానికి రెండు జట్లు పోరాడుతున్నాయి.
ఈ మ్యాచ్ టీమిండియా టాస్ గెలిచింది. ఏ మాత్రం ఆలోచించకుండా జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఇమాముల్ హక్ ఇన్నింగ్ ఆరంభించారు. దూకుడుగా ఇన్నింగ్ మొదలుపెట్టినప్పటికీ- చాలా త్వరగా తొలి వికెట్‌ను కోల్పోయింది పాకిస్తాన్.

హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వారిని దెబ్బకొట్టాడు. తొలి వికెట్‌ను నేల కూల్చాడు. పాకిస్తాన్ స్కోర్ 41 పరుగుల వద్ద ఉన్నప్పుడు అబ్దుల్లా షఫిక్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఎనిమిదో ఓవర్ చివరి బంతికి షఫీక్ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేశాడు షఫిక్.
సిరాజ్ చేతి నుంచి వెలువడిన లో- పిచ్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు షఫిక్. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్త బలంగా ప్యాడ్స్‌ను తాకింది. ప్లేయర్లు అప్పీల్ చేయడం, అంపైర్ తన వేలిని పైకెత్తడం చకచకా సాగిపోయాయి. దీనితో సిరాజ్ అతనిపై పగ తీర్చుకున్నట్టయింది. స్టేడియంలో మళ్లీ జోష్ పెరిగింది.
12 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ఇమాముల్ హక్- 32, కేప్టెన్ బాబర్ ఆజమ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 13 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు బాబర్. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
కాగా- ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ పెద్ద పొరపాటే చేశాడు. రాంగ్ జెర్సీని ధరించి ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఇది- అతనికి కేటాయించిన జెర్సీ కాదు. అనఫీషియల్ జెర్సీ అది. దాన్ని వేసుకుని గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ ఆరంభమైన తరువాత తన పొరపాటును గ్రహించాడు కోహ్లీ. దాన్ని మార్చుకునే అవకాశం లేకపోవడంతో ఆ పని చేయలేకపోయాడు.
నిజానికి- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన జెర్సీ వేరే. దానికి భుజాలపై త్రివర్ణ పతాకంలోని రంగులు ఉంటాయి. జాతీయ పతాకాన్ని పోలిన విధంగా భుజాలపై మూడురంగులను ముద్రించారు. దీన్ని కాకుండా- కోహ్లీ మాత్రం పొరపాటున మూడూ తెలుపురంగులే ఉన్న జెర్సీని ధరించి మ్యాచ్ ఆడుతున్నాడు.












Click it and Unblock the Notifications