కేన్ మామ అవుట్..!!

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో బిగ్ డే. రోహిత్ సేన రంగంలోకి దిగబోతోంది. తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. చెన్నైలోని ఎంఏ చిన్నస్వామి స్టేడియం ఈ బిగ్ క్లాష్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది.

అంతకుముందు- ప్రపంచకప్ 2023 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయఢంకా మోగించింన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్యాటర్లు కొట్టి అవతల పడేశారు. 36.2 ఓవర్లలోనే భారీ టార్గెట్‌ను ఛేదించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే- 152, టాప్ ఆర్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర- 123 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

World cup 2023, NZ vs NED: Kane Williamson ruled for the kiwis 2nd game

ఈ ఊపు మీద ఉన్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. రెండో మ్యాచ్‌కు కేప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల తుదిజట్టులో కేన్‌ను తీసుకునే అవకాశాలు లేవు. కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు కేన్ దూరం అయ్యాడని వెల్లడించారు.

ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ, ఆల్‌రౌండర్ లోకీ ఫెర్గూసన్ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. గాయాల కారణంగా వారు జట్టుకు దూరం అయ్యారు. వందశాతం ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల అటు కేన్ విలియమ్సన్ కూడా ఆడకపోవడం పట్ల న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తుక్కు రేగ్గొట్టిన న్యూజిలాండ్ సోమవారం రెండో మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. ఈ నెల 13వ తేదీన జరిగే బంగ్లాదేశ్‌తో తలపడే మ్యాచ్‌ నాటికి కేన్ విలియమ్సన్ అందుబాటులోకి వస్తాడని గ్యారీ స్టెడ్ తెలిపారు. అతని ఫిట్‌నెస్‌ మెరుగు పడుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+