Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్‌ జట్టులో కలకలం: అరెస్ట్ భయం- హైదరాబాద్ నుంచి హడావుడిగా స్వదేశానికి..!!

హైదరాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్- 46, డేవిడ్ వార్నర్- 41 పరుగులు చేశారు. ఇన్నింగ్ మొత్తానికీ వారిద్దరే టాప్ స్కోరర్లు. మిఛెల్ స్టార్క్- 28, మార్ముస్ లాంబుషెన్- 27, పాట్ కమ్మిన్స్- 15, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 15 పరుగులు చేశారు.

World Cup 2023:

అటు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా తన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించిందా జట్టు. ఈ నెల 10వ తేదీన అంటే మంగళవారం తన రెండో మ్యాచ్ ఆడబోతోంది బాబర్ ఆజమ్ సేన. శ్రీలంకతో తలపడబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయిందీ మ్యాచ్.

ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ జట్టులో కలకలం చోటు చేసుకుంది. ఆ జట్టు విమెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జైనబ్ అబ్బాస్ (Sports presenter Zainab Abbas) హడావుడిగా స్వదేశానికి వెళ్లిపోయారు. అరెస్ట్ భయమే దీనికి కారణం. ఆమె మీద కేసు నమోదైంది. ఫలితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆమె పాకిస్తాన్‌కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా పాక్ వెళ్తారు.

Pakistan sports presenter Zainab Abbas

గతంలో జైనబ్ అబ్బాస్ (Zainab Abbas) హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ మీద పోస్ట్ చేశారు. వాటిని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్.

ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో రెండు రోజుల ఫిర్యాదు చేశారు. జైనద్ అబ్బాస్‌పై సెక్షన్ ఐపీసీలోని 153ఏ, 295, 506,121, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐసీసీ ప్రపంచ కప్ నుంచి తక్షణమే స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించాలనీ డిమాండ్ చేశారు.

ఈ పరిణామాల మధ్య జైనాబ్ అబ్బాస్.. అరెస్ట్ భయంతో తన స్వదేశం పాకిస్తాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ పరిణామాలు కొంతవరకు పాకిస్తాన్ జట్టును ఆందోళనకు గురి చేసినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీని ప్రభావం జట్టు ఆటతీరుపై పడకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది మేనేజ్‌మెంట్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+