World Cup 2023: భారత్ -పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ వేళ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!!
ప్రపంచ కప్ సమరం మొదలైంది. క్రికెట్ లవర్స్ ఇండియా మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 8న ఆసీస్ తో ప్రపంచ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు డాషింగ్ ఓపెనర్ శభమన్ గిల్ ఆడటం సందేహంగా మారింది. యావత్ దేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా భారత్, పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్ వేళ అభిమానుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అసలే ప్రపంచ కప్. అందునా భారత్ వర్సస్ పాక్ మ్యాచ్. అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది సేపటికే టికెట్లు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే హోటల్ రూమ్స్ ఖాళీలు లేవు. 12,13,14, తేదీల్లో విమానాల ఛార్జీలు పెంచేసారు. యావత్ క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఈ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ను తిలకించేందుకు దాదాపు లక్ష మంది అభిమానులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు తరలి వస్తున్నారు. ఈ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానుల కోసం రైల్వే శాఖ ఒక శుభవార్త చెప్పింది.

భారత్, పాక్ మ్యాచ్ జరిగే రోజుల రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా వందేభారత్ రైళ్లను నడపనుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్ల సమయాలు, ధరలు, స్టేషన్ల వివరాలను ప్రకటించేలా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. మ్యాచ్ కోసం అహ్మదాబాద్ కు చేరుకొనే అభిమానులకు పెరిగిన విమాన, హోటల్ ధరల కారణంగా ప్రయాణానికి సౌకర్యంగా ప్రత్యేకంగా వందేభారత్ సేవలను అందు బాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ ప్రారంభం కావటానికి కొద్ది గంటల ముందు అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లకు చేరుకుంటాయి. ఈ రెండు స్టేషన్లు స్టేడియంకు దగ్గరగా ఉండటంతో అభిమానులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ మగిసిన తరువాత కూడా తిరిగి గమ్య స్థానాలకు ఇవే ప్రత్యేక రైళ్లు చేరుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications