భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు షా ద్వయం: భద్రత గుప్పిట్లో నరేంద్ర మోదీ స్టేడియం..!!
హైదరాబాద్: ఇంకో మూడు రోజులు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కళ్ల ముందుకు రాబోతోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ తరువాత మళ్లీ భారత్- పాకిస్తాన్ ఢీ కొట్టబోతోండటం ఇదే తొలిసారి.
ఈ నెల 14వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. రోహిత్ సేన కూడా ఈ మ్యాచ్ కోసం పూర్తి సన్నద్ధమైంది. ఈ మ్యాచ్‌కు కనివినీ ఎరుగని విధంగా భారీ భద్రతను కల్పించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయి కూడా.

14వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియానికి కల్పించాల్సిన భద్రతపై గుజరాత్ హోం మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. ఆ రాష్ట్ర డీజీపీ, అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అదనపు బలగాలను మోహరింపజేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఈ మ్యాచ్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. శనివారం మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగే వేడుకలకూ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారని తెలుస్తోంది. అమిత్ షా కొడుకు జై షా.. బీసీసీఐ కార్యదర్శి హోదాలో ఇందులో పాల్గొంటారు.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్.. చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్నారు. ఇలాంటి ఓ కార్యక్రమానికి వారిద్దరూ అటెండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. టాప్ ప్లేబ్యాక్ సింగర్ ఆర్జిత్ సింగ్ సైతం ఈ ప్రోగ్రామ్‌లో పెర్‌ఫార్మ్ చేయనున్నాడు.
ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ విజయాలు అందుకున్నాయి. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది భారత్. నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది పాకిస్తాన్. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్, మలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది. ఈ విజయాలతో పరస్పర పోరాటానికి దిగనున్నాయి.












Click it and Unblock the Notifications