114 ఏళ్ల వయస్సులో రోడ్డు ప్రమాదంలో కన్నుమూత
Fauja Singh: మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 114 సంవత్సరాలు. పంజాబ్ లోని జలంధర్ రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ప్రపంచంలోనే అత్యంత వయోధిక వృద్ఢుడైన మారథాన్ రన్నర్ గా గుర్తింపు పొందారు. ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ మూలాలున్న బ్రిటీష్ సిక్ అథ్లెట్ ఫౌజా సింగ్. ఆయన స్వస్థలం పంజాబ్ లోని బియాస్. ఇంటి బయట వాకింగ్ చేస్తోన్న ఆయనను ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన మరణించారు. జలంధర్-పఠాన్ కోట్ రహదారిపై ఈ ఘటన సంభవించింది. దీనిపై పోలీసులు హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

బ్రిటీష్ పౌరసత్వం ఉన్న ఫౌజా సింగ్ కొంతకాలంగా తన స్వగ్రామంలో నివసిస్తోన్నారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద వాకింగ్ చేస్తోన్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
టర్బన్డ్ టొర్నడోగా పేరుంది ఫౌజా సింగ్ కు. 89 సంవత్సరాల వయస్సులో మారథాన్ రన్నర్ గా కేరీర్ ప్రారంభించారు. ప్రపంచ రికార్డులు సృష్టించారు. మారథాన్ పూర్తి చేసిన మొదటి శతాధిక వృద్ధుడిగా రికార్డు నెలకొల్పారు. ఆయన తరువాత మరెవరూ ఇప్పటివరకు ఈ రికార్డును అందుకోలేదు.
1911, ఏప్రిల్ 1వ తేదీన జలంధర్‌లోని బియాస్ పిండ్ లో జన్మించారు ఫౌజా సింగ్. అయిదు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు నడవలేని స్థితి ఆయనది అప్పట్లో. 1992లో ఆయన భార్య మరణించిన తరువాత లండన్ కు తరలి వెళ్లారు. పిల్లలతో సహా అక్కడే స్థిరపడ్డారు.
1994లో ఆయన అయిదవ కుమారుడు కుల్ దీప్ మరణించారు. ఆ బాధను దిగమింగుకోవడానికి జాగింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తరువాత దీన్ని మారథాన్ గా మార్చుకున్నారు. 89 సంవత్సరాల వయస్సులో దీన్ని మారథాన్ గా మలచుకున్నారు. లండన్ మారథాన్ ను 6:54 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.
2011లో వంద సంవత్సరాల వయస్సులో టొరంటోలోని ఒంటారియో మాస్టర్స్ అసోసియేషన్ లో పాల్గొన్నారు. ఈ ఇన్విటేషనల్ మీట్ లో ఒకే రోజున ఎనిమిది విభాగాల రికార్డులను బద్దలు కొట్టారు. అసాధారణ విజయం సాధించారు. 100 మీటర్లను 23.14, 200 మీటర్లను 52.23, 400 మీటర్లను 2:13.48 సెకెన్లల్లో పూర్తి చేసిన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు.
ఈ రికార్డులు నెలకొల్పిన మూడు రోజుల తరువాత సింగ్ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి శతాధికారిగా టొరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌ను 8 గంటల 11 నిమిషాల 6 సెకన్లలో పూర్తి చేశాడు. లండన్, న్యూయార్క్, టొరంటో, ముంబైతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మారథాన్‌లలో పాల్గొన్నారు. 2003 టొరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌లో 90 పైనున్న విభాగంలో 5:40 నిమిషాల్లో రన్ పూర్తి చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications