మ్యూజికల్ ఛైర్ లా మారిన కేప్టెన్సీ- రేసులో టీమిండియా డాషింగ్ ఓపెనర్

ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 15వ తేదీ నాటికి అన్ని ఫ్రాంఛైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల మధ్య రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఫ్రాంచైజీ చూస్తోంది. ఈ విషయంపై ఫ్రాంఛైజీ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే ఈ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు జరిగాయి.

రాహుల్ ద్రావిడ్ నిష్క్రమించిన తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఆర్‌ఆర్‌కు హెడ్ కోచ్‌గా తిరిగొచ్చాడు. సంగక్కర 2021 నుండి ఈ జట్టుకు డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నాడు. సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్‌తో కూడా తన బంధాన్ని తెంచుకుంది ఆర్ఆర్ ఫ్రాంఛైజీ. ఇప్పుడు తాజాగా కేప్టెన్ సంజు శాంసన్ ను బయటికి పంపించనుంది. సంజు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ లేదా మతీష పతిరానా బదులుగా శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంది.

Yashasvi Jaiswal and Dhruv Jurel Lead IPL 2026 Contenders for Rajasthan Royals

శాంసన్ నిష్క్రమించితే రాజస్థాన్ రాయల్స్ కు కేప్టెన్ ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రాజస్థాన్ రాయల్స్ కు 67 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో రాయల్స్ 33 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 33 మ్యాచ్‌లలో ఓడిపోయింది. అతని కేప్టెన్సీలో ఐపీఎల్ 2022 ఫైనల్‌, 2024లో ప్లేఆఫ్‌కు చేరుకుందీ టీమ్. అయినప్పటికీ- అతన్ని వదులుకోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది.

నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది. దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు. 2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది.

సంజు శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తే ప్రత్యామ్నాయంగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, లేదా టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు కేప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వీరిద్దరి పేర్లను ఫ్రాంచైజీ పరిశీలిస్తోంది. ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో గాయం కారణంగా సంజు కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పుడు రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ నాయకత్వం వహించాడు. ప్రస్తుతం అతను కేప్టెన్సీ రేసులో లేడు. జురెల్, జైస్వాల్ వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+