Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year ender 2023: అది నిజం కాకపోతే బాగుండు

ICC World cup 2023 final: దేశీయ క్రీడారంగంలో 2023.. చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. క్రికెట్‌లో కోట్లాదిమంది అభిమానులకు పీడకలగా మారింది. అప్పటివరకు ఉన్న జోష్ మొత్తం కూడా.. ఒకే ఒక్క మ్యాచ్‌తో తుడిచిపెట్టేసింది. అది నిజం కాకపోతే బాగుండునని అనిపించేలా చేసింది.

అదే- ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్. క్రికెట్ ప్రేమికులతో కన్నీళ్లు పెట్టించిన మ్యాచ్ ఇది. భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నవంబర్ 19వ తేదీన సాగిన ఈ తుదిపోరులో టీమిండియా అనూహ్యంగా పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.

Year Ender 2023: Fans disappointed after India loss the match to Australia in ICC World Cup 2023

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ లీగ్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. సెమీ ఫైనల్స్‌లో అదే ఆధిపత్య ధోరణిని ప్రదర్శించిన రోహిత్ సేన.. ఫైనల్స్‌లో చతికిల పడటాన్ని ఏ ఒక్క అభిమాని కూడా జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజుల పాటు ఈ పీడకల అభిమానులను వెంటాడింది.

తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. 43 ఓవర్లల్లో 241 పరుగులతో విజయదుందుభి మోగించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. మిడిలార్డర్ బ్యాటర్ మార్నుస్ లాంబుషెన్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Year Ender 2023: Fans disappointed after India loss the match to Australia in ICC World Cup 2023

ఈ వరల్డ్ కప్‌‌లో ఒక్కసారి కూడా భారత్ ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్లే. ప్రతి మ్యాచ్‌లోనూ పోటీ పడి వికెట్లు నేల కూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్‌లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. జస్‌ప్రీత్ బుమ్రా-2, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అటు టీమిండియా బ్యాటింగ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. రోహిత్ శర్మ- 47, విరాట్ కోహ్లీ- 54, కేఎల్ రాహుల్- 66 పరుగులు చేశారు. ఈ ముగ్గురు తప్పిస్తే మిగిలిన బ్యాటర్లెవరూ తమ సామర్థ్యాన్ని తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా సమష్టిగా విఫలం అయ్యారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ దుఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీటితో గ్రౌండ్‌ను వీడారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ అభిమానుల కళ్లముందే కదలాడుతుండొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+