ఫ్యాన్స్ చేసిన పనికి బిత్తరపోయిన రోహిత్ శర్మ (వీడియో)
భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో తన భార్య, కుమారుడితో వెళ్తుండగా ఇద్దరు టీనేజ్ అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అమర్యాదగా ప్రవర్తించారు. కారులోంచి చేయి అందించగా, వారు బలవంతంగా లాగడంతో రోహిత్ అసహనం వ్యక్తంచేశారు. వేలెత్తి చూపుతూ వారిని హెచ్చరించారు. కారు విండో గ్లాస్ ను పైకి ఎత్తారు.
రోహిత్ శర్మ తన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం గుజరాత్ లోని జామ్‌నగర్ నుంచి ముంబైకి చేరుకున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. అభిమానానికి హద్దులు ఉండాలని, సెలెబ్రిటీలకు కొంత ప్రైవసీ తప్పదనీ చెబుతున్నారు. రోహిత్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆ పిల్లలను తప్పుపట్టారు. రోహిత్ ప్రతిస్పందనను సమర్థించారు. అభిమానులు పరిమితులు పాటించాలని సూచించారు. వ్యక్తిగత భద్రతకు ఆయన ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదని పేర్కొన్నారు.

సాధారణంగా ఫ్యాన్స్ ను ఎప్పుడూ హర్ట్ చేయడు రోహిత్ శర్మ. గ్రౌండ్ లో ఎంత సరదాగా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. తనను కలిసిన అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. సెల్ఫీలుగా దిగుతుంటాడు. వారిని ఏ మాత్రం నిరాశపర్చడు. తానో గొప్ప క్రికెటర్ అనే భావనను ఎప్పుడు కనపర్చనివ్వడు. కలివిడిగా ఉంటాడు. తరచుగా ప్రాక్టీస్ అనంతరం అభిమానులతో కలిసి స్నేహపూర్వకంగా ఫోటోలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేస్తుంటాడు.
Rohit Sharma got angry on his fans for misbehaving... 😡🤬
— Jara (@JARA_Memer) January 4, 2026
Rohit At the End : Daya, Jara Inko Garden Me Lekar Aao to, Vahi Khabar Leta Hu 😅 pic.twitter.com/cVvwAzuXFD
ఇప్పుడు కూడా రోహిత్ శర్మ.. తనను పలకరించడానికి వచ్చిన వారిని నిరాశపర్చలేదు. ఫొటో దిగాలని కోరగా.. రమ్మంటూ సైగ చేశాడు. వారిలో ఒకరికి షేక్ హ్యాండ్ సైతం ఇచ్చాడు. సెల్ఫీ కోసం చేయ్యి పట్టుకుని లాగడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వారి ప్రవర్తనపై అసహనానికి గురయ్యాడు రోహిత్. వారిని హెచ్చరిస్తూ, కారు కిటికీని పైకి ఎత్తాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ఇంటర్నేషనల్స్ కు సన్నద్ధమవుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై ఇటీవలే 155 పరుగులు చేసి, ఫామ్ లోకి వచ్చాడు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications