అమ్మాయిని హగ్ చేసుకుంటే తప్పా? పాత వివాదంపై యువీ క్లారిటీ!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన కెరీర్లోని ఓ పాత వివాదంపై నోరు విప్పారు. తన డేటింగ్ లైఫ్ గురించి అప్పట్లో మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలపై ఆయన ఘాటుగా స్పందించారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షో 'సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా' (Serving it Up with Sania)లో పాల్గొన్న యువీ.. ఒకానొక సమయంలో మీడియా తనపై నెగెటివిటీని ఎలా ప్రచారం చేసిందో వివరించారు.

పాత వివాదంపై క్లారిటీ ఇచ్చిన యువీ!
యువరాజ్ సింగ్ తన హయాంలో అత్యంత పాపులర్ క్రికెటర్ కావడంతో, ఆయన వ్యక్తిగత జీవితంపై మీడియా ఎప్పుడూ నిఘా ఉంచేది. ముఖ్యంగా ఆయన ఎవరితో డేటింగ్ చేస్తున్నారు? ఎవరితో కనిపిస్తున్నారు? అనేవి హాట్ టాపిక్‌లుగా ఉండేవి. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో మీడియా తనను ఎంతగా ఇబ్బంది పెట్టిందో యువీ గుర్తు చేసుకున్నారు. యువీ ఆ సంఘటన గురించి వివరిస్తూ.. "నేను కొత్తగా ఓ మేనేజర్‌తో పని చేయడం మొదలుపెట్టిన రోజుల్లో జరిగిన సంఘటన ఇది. సాధారణంగా మనం ఎవరినైనా కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా హగ్ ఇస్తుంటాం. నేను నా మేనేజర్‌ను కలిసినప్పుడు కూడా అలాగే చేశాను. కానీ అప్పట్లో మీడియా ఆ విషయాన్ని మరోలా చిత్రికరించింది. నేను మ్యాచ్ మధ్యలో సమయం దొరికితే ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతున్నాను అంటూ కథనాలు రాశారు" అని యువరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

yuvraj singh Lifts Lid on Old Controversy Portrayed Hugging My Manager as Meeting a Girl slams media

నెగెటివిటీపై యువీ ఫైర్
సెలబ్రిటీల జీవితంలో ఇలాంటి రూమర్లు సహజమేనని అంగీకరిస్తూనే.. రీడర్‌షిప్ కోసం మీడియా చేసే ఇలాంటి ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. "ప్రస్తుతం సమాజంలో పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా ప్రచారంలో ఉంటోంది. నెగెటివ్ వార్తలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు లేకపోతే ప్రజలు చదవరు అనే భావన మీడియాలో ఉంది. దీనివల్ల వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. మీడియాలో పాజిటివ్ స్టోరీస్ ఎక్కువగా రావాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

అద్భుతమైన కెరీర్
2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ 2019లో రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 398 మ్యాచ్‌లు ఆడి 11,000 పైగా పరుగులు చేశారు. 2011 ప్రపంచకప్ విజయంలో యువీ పాత్ర మరువలేనిది. ఒకే వరల్డ్ కప్‌లో 300లకు పైగా పరుగులు చేసి, 15 వికెట్లు తీసిన మొదటి ఆల్ రౌండర్‌గా రికార్డు సృష్టించారు. ఆ టోర్నీలో ఆయన 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచారు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన యువరాజ్ సింగ్, ఇప్పటికీ ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+