శిష్యుడు అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ క్రేజీ పోస్ట్!
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఈ క్రమలో తన గురువు యువరాజ్ సింగ్ నెలకొల్పిన ఓ చారిత్రాత్మక రికార్డును అభిషేక్ శర్మ తృటిలో చేజార్చుకున్నాడు. యువరాజ్ సింగ్ రికార్డును తృటిలో మిస్ చేసుకునన తన శిష్యుడు అభిషేక్ శర్మపై యువీ చేసిన సరదా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది..
రికార్డుకు అడుగు దూరంలో..
గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇది టీ20 ఇంటర్నేషనల్‌లో ఓ భారతీయ బ్యాటర్ చేసిన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్థ శతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి అభిషేక్ మరో రెండు బంతుల దూరంలో ఆగిపోయాడు.

వైరల్ అవుతున్న యువీ పోస్ట్
మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్ సింగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిషేక్‌ను అభినందిస్తూనే చిన్నగా ఆటపట్టించాడు. "ఇప్పటికీ 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టలేకపోతున్నావు కదూ? వెల్ ప్లేడ్.. ఇలాగే ఆడుతూ ఉండు" అని యువీ పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు గురువుకు తగ్గ శిష్యుడని, వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు.
Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4
— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026
అభిషేక్ శర్మ ఏమన్నాడంటే?
యువీ రికార్డు గురించి మ్యాచ్ అనంతరం అభిషేక్ స్పందిస్తూ.. "యువీ పా (యువరాజ్) రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చు. నా ప్రాధాన్యత రికార్డుల కంటే జట్టు విజయంపైనే ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, కెప్టెన్ ఇచ్చే స్వేచ్ఛ వల్లే నేను ఇలా ఆడగలుగుతున్నాను" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.
సిరీస్ క్లీన్ స్వీప్ దిశగా భారత్
అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57 నాటౌట్) మెరుపులతో భారత్ కేవలం 10 ఓవర్లలోనే కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తో భారత్ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications