‘నీ కోసం ఏదైనా చేస్తా యుజీ’: సొట్టబుగ్గల సుందరి బంపరాఫర్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓపెనర్‌గా వస్తానన్న చాహల్.. ప్రీతి షాకింగ్ రిప్లై!
పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, యుజ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి ఓ ఫన్నీ రిక్వెస్ట్ పెట్టారు. "మేమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?" అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. "తప్పకుండా యుజీ.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు" అంటూ ఎమోజీలతో అదిరిపోయే సమాధానమిచ్చారు.

ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ టాప్
ఈ సీజన్ సగం ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ ఏకైక అజేయ జట్టుగా నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న పంజాబ్.. మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలుస్తుంది. జట్టులో నెలకొన్న సానుకూల వాతావరణం, ఆటగాళ్ల మధ్య ఉన్న సాన్నిహిత్యం పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat
— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026
రికార్డు ఛేజింగ్‌తో చరిత్ర సృష్టించిన పంజాబ్
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీ20 చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ అలవోకగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ (152) అద్భుత సెంచరీతో చెలరేగినప్పటికీ.. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (76), ప్రియాన్ష్ ఆర్య (73) మొదటి వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 126 పరుగులు జోడించి పునాది వేశారు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.












Click it and Unblock the Notifications