నా భార్య తప్పు చేసింది.. టీమిండియా క్రికెటర్ సంచలన కామెంట్స్
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. చాహల్ వైవాహిక జీవితం గురించి తెలిసిన విషయమే.ధనశ్రీ వర్మను చాహల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా డ్యాన్స్‌లతో అమ్మడు అదరగొడుతుంటుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో ఈ జంట విడాకుల బాట పట్టారు. చాహల్ , ధనశ్రీ వర్మల ప్రేమ వివాహం విడాకులకు దారితీయడం అభిమానులను నిరాశపరిచింది.
వారి విడాకుల తర్వాత కూడా ఈ వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. ఇటీవల చాహల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ తర్వాత ధనశ్రీ పెట్టిన పోస్టులు ఈ అంశాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చాయి. విడాకుల తర్వాత ధనశ్రీ దుబాయ్‌కి వెళ్లి, తన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ, అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో దుబాయ్ సంస్కృతి, మత సామరస్యం గురించి రాస్తూ, అక్కడి హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తెలిపింది. ఈ పోస్టులు ఆమె విడాకుల తర్వాత జీవితంలో కొత్త ప్రశాంతతను వెతుక్కుంటున్నట్లు అనిపిస్తున్నాయి.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో చాహల్ మాట్లాడుతూ, తమ విడాకులకు పరోక్షంగా ధనశ్రీ వైపు నుంచే తప్పు జరిగిందని వ్యాఖ్యానించారు. మొదట తాను ఈ విషయాలపై స్పందించకూడదనుకున్నప్పటికీ, ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదని అన్నారు. చాహల్ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే, ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక పోస్టును షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనితో, నెటిజన్లు ఆమె చాహల్‌కు పరోక్షంగా సమాధానం ఇచ్చిందని భావిస్తున్నారు. ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, వారి సోషల్ మీడియా పోస్టులు మరియు వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications