హోటల్లో అమ్మాయితో దొరికిపోయిన చాహల్..!

టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మలది ప్రేమ వివాహం. 2020లో వీరి వివాహం జరిగింది. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.

ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె తన ప్రత్యేకమైన డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు.ధనశ్రీ చిన్నప్పటి నుండి భరతనాట్యం నేర్చుకున్నారు. ఆమె తన స్వంత డ్యాన్స్ కంపెనీని కూడా స్థాపించారు. ఇటీవలే ఆమె ఓ తెలుగు సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించడానికి రెడీ అయ్యారు.అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Yuzvendra Chahal With Mystery Girl After Divorce With Wife Dhanashree Verma

వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పుడే వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పెళ్లి రోజున సైతం వీరిద్దరు విషెష్ చెప్పుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో చాహల్ మరో అమ్మాయితో కనిపించి షాకిచ్చాడు. ముంబైలోని హోటల్‌లో ఓ అమ్మాయితో చాహల్ కనిపించాడు. ఆమెతో కలిసి హోటల్ బయటకు వచ్చే సమయంలో మీడియాను చూసి చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు. వైట్ టీ-షర్ట్, బ్యాగీ జీన్స్‌తో ధరించిన చాహల్.. కెమెరాల కంటపడకుండా ఉండేందుకు ఆపసోపాలు పడ్డాలు. హోటల్ పిల్లర్స్ వెనుకాల దాక్కోవడం, చేతులను కవర్ చేసుకోవడం వంటి పనులు చేశాడు. ఈ చర్యలతో ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే సదరు యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు ప్రచారం జరుగుతోంది. ధనశ్రీతో పరిచయం కాకముందే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఈ వార్తలను చాహల్ ఖండించాడు. పెళ్లి అయిన తర్వాత కూడా తనిష్క కపూర్‌తో చాహల్ సీక్రెట్ అఫైర్ నడిపించాడని, దాంతో ధనశ్రీతో గొడవలు మొదలయ్యాయనే వాదను కూడా తెరపైకి వచ్చింది. చాహల్ వ్యవహారం నచ్చకనే ధనశ్రీ వర్మ విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+