చాహల్‌కు మాజీ భార్య కౌంటర్..మరో అమ్మాయితో కనిపించడంతో
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది.యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.
ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది.

దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నాయి.ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నారు.తమ విడాకుల గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్,ధనశ్రీ వర్మ విడాకుల తుది విచారణ సాగుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, చాహల్ స్టాండ్స్‌లో ఒక మహిళతో కనిపించాడు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాహల్‌తో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీయగా, ఆమె ఓ ఆర్జే మహవాష్‌గా తేలింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందని పుకార్లు వచ్చాయి, అయితే మహవాష్ వాటిని ఖండించారు. వీరిద్దరి ఫోటోలు వైరల్ అయిన తర్వాత చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహిళలను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆమె పోస్టు పెట్టింది.చాహల్ వల్ల ఆ అమ్మాయి అందరి ముందు దోషిలా మారిందనే అర్థం వచ్చేలా ధనశ్రీ వర్మ కామెంట్ చేసింది.












Click it and Unblock the Notifications