వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూపంలో అసమ్మతి సెగ

By Staff
|
Google Oneindia TeluguNews

భారీ అంచనాలు, ఉత్కంఠ మధ్య ఇద్దరు అగ్ర హీరోల భారీ చిత్రాలు గురువారం(11.01.2001) విడుదలయ్యాయి. చిరు చిత్రం అనగానే పండుగ వాతావారణం నెలకొనడం సహజమే కదా. ప్రధాన థియేటర్‌ సంధ్య 35ఎం.ఎం.తో పాటు రాష్ట్రంలో మృగరాజు చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో అభిమానుల సందడే సందడి. సమరసింహరెడ్డి తర్వాత బి.గోపాల్‌ కాంబినేషన్‌ లో వచ్చిన బాలకృష్ణ చిత్రం నరసింహనాయుడు. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ప్రేక్షకుల సందోహమే. సినిమా థియేటర్ల వద్ద గురువారం అంతా కోలాహాలమే. సినిమాకు వచ్చిన ప్రేక్షకులు, టికెట్లు దొరకని ప్రేక్షకులు, అడ్వాన్స్‌ బుకింగ్‌ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిల్చున్న వారితో అన్ని థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల ఫలితాలు ఏమిటో తెలుసుకునేందుకు ఇండియా ఇన్ఫో ప్రయత్నించింది. విజయవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్‌ లలోని డిస్ట్రిబ్యూటర్లతో, థియేటర్ల యజమానులతో పరిశీలకులతో మాట్లాడి...ఈ రెండు చిత్రాల అందిస్తున్నాం.

మృగరాజు:
ఆంధ్రాలో ఈ చిత్రం నిరాశపరుస్తుందని అంటున్నారు. చిరంజీవి రేంజ్‌ ప్రకారం ఇది బిలో యావరేజని విజయవాడకు చెందిన ఓ థియేటర్‌ యజమాని తెలిపారు. నైజాంలో యావరేజ్‌ అని రిపోర్ట్‌. అయితే ఓ వారం ఆగితే గానీ పూర్తి రిజల్ట్‌ తెలియదు. చిరంజీవి చిత్రాలు అనూహ్యంగా పుంజుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి.

నరసింహనాయుడు:
ఆంధ్రాలో ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని చెపుతున్నారు. మినిమం 25 వారాలు ఆడుతుందని అంటున్నారు. పాటలు ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అని విమర్శకులు అభిప్రాయం.

డిస్ట్రిబ్యూటర్ల ఆఫీస్‌ ల్లో ఐటి దాడులు?
ఈ రెండు చిత్రాలు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న ఆసియా ఫిలింస్‌, మహాలక్ష్మి ఫిలింస్‌ కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ బుధవారం(10.01.2001) దాడులు జరిపిందని తెలిసింది. అయితే దీనిపై భిన్న కథనాలు విన్పిస్తున్నాయి. అధికారిక ప్రకటన చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ నిరాకరిస్తోంది. దాడుల్లో రెండు కోట్ల రూపాయల బ్లాక్‌ మనీ లభ్యం అయిందని తెలిసింది. మృగరాజు చిత్రాన్ని ఏషియన్‌ ఫిలింస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ 5 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి నైజాం హక్కులను కైవసం చేసుకొంది. నైజాం ఏరియా హక్కులే చిరంజీవి రెమ్యూనరేషన్‌. అంటే చిరు రెమ్యూనరేషన్‌ 5 కోట్లకు పైగా అన్నమాట. తెలుగు సినిమా స్టేమినా ఏమిటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నరసింహనాయుడు చిత్రం నైజాం హక్కులను 1.25 లక్షలకు మహాలక్ష్మి ఫిలింస్‌ సొంతం చేసుకొంది. ఈ రెండు చిత్రాలపై ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం, సినిమా పత్రికల్లోనూ ప్రచారం జరగడంతో ఐటి శాఖ దాడులు నిర్వహించిందని తెలిసింది.

గత సంచికలో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X