• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబుచుట్టూ బంధాలు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Wednesday, July 28 2004

హైదరాబాద్‌:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడురోజు రోజుకూ కాంగ్రెస్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నారు.ఏలేరు మొదలుకుని ఇప్పటికి పదకొండుఅంశాల్లో దర్యాప్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వంఆదేశించింది. ఇది పైకి రాజకీయ కక్షసాధింపుగాకన్పించకపోయినా అటువంటి ధోరణిఅంతర్లీనంగా కన్పిస్తోంది.

చంద్రబాబునాయుడు వ్యూహచతురతనుకాంగ్రెస్‌ నాయకులు తక్కువగా అంచనావేయడం లేదు. గతంలో ప్రతిపక్షంలోఉన్నప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడిలాగాపనిచేశారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకుఅప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లిజనార్ధనరెడ్డి అనుమతి ఇచ్చినప్పుడుఅందుకు వ్యతిరేకంగా ఆయన నిర్వహించినప్రజాఉద్యమాలు అందుకు చిన్న ఉదాహరణ.ఆ సమయంలో ఎమ్మెల్యేగా లేని చంద్రబాబుఅసెంబ్లీలో కాకుండా ఫీల్డ్‌వర్క్‌ చేశారు. అప్పటికాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికిఅందిన ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోలేదు.

చంద్రబాబునాయుడికి ఈసారి అటువంటి అవకాశాలు ఇవ్వకుండాఅయిదేళ్ళూ ఆయనను డిఫెన్స్‌లో పడేయాలన్నదికాంగ్రెస్‌ వ్యూహంలా కన్పిస్తున్నది. సిఎంగాఆయన వాడిన విమానాలకు అయిన ఖర్చునుఅసెంబ్లీలో వెల్లడి చేయడం కక్ష సాధింపులోతొలి అడుగులు మాత్రమే. సాధారణంగాఅభివృద్ధి పనులు బాగా చేసిన ప్రభుత్వాలమీదనే అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలువస్తుంటాయి. తొమ్మిదేళ్ళలో చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి

ప్రజల్లోహృదయాల్లో పెద్దగా రిజిస్టర్‌ కాలేదు.దీనిని ఆసరాగా చేసుకుని చంద్రబాబు నాయుడుహయాంలో జరిగిన కుంభకోణాలకు పెద్ద ప్రచారంకల్పించాలని రాజశేఖరరెడ్డి కోటరీ ప్రయత్నిస్తోంది.

నాలెడ్జి,డేటా విషయంలో ఇప్పటికీ చంద్రబాబుకాంగ్రెస్‌ నాయకుల కంటే ముందున్నారు.ఈ విషయం అనేకసార్లు అసెంబ్లీ సమావేశాల్లోవెల్లడయింది. కాంగ్రెస్‌ హామీల చిట్టా రోజురోజుకూపెరగడంతో అవి ఎంతవరకు అమలులోకివస్తాయన్నది సందేహాస్పదం. ఒక్కమాటలోచెప్పాలంటే రాజశేఖరరెడ్డి ప్రభుత్వంమూడు నెలలైనా గెలుపు అనే హాంగోవర్‌నుంచి బయటపడలేదు. హామీలు నిలబెట్టుకునేదిశగా ఫైళ్ళు వేగంగా కదలడంలేదు. పరిస్ధితి ఇదే విధంగా ఉంటే ప్రజల్లోక్రమంగా అసంతృప్తి చోటు చేసుకునే అవకాశంఉంది. పరిపాలన విషయంలో చంద్రబాబుకూ,వైఎస్‌కూ చాలా తేడా ఉంది. చంద్రబాబు అన్నీతానేగా వ్యవహరించారు. రాజశేఖరరెడ్డిహయాంలో మంత్రులకు అపరిమిత స్వేచ్ఛఉన్నట్టు కన్పిస్తోంది. ఈ రెండు ధోరణులూ ప్రమాదకరమే.పరిపాలనలో ఒక బ్యాలెన్స్‌ ఉండాలి.

చంద్రబాబునాయుడు హయాంలో ప్రచార కార్యక్రమాల్లోపెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్టుఆరోపణలు ఉన్నాయి. నిశితంగా పరిశీలించినవారికి అందులో నిజాలు కన్పించకపోవు.పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు, డిస్టిలరీలతో ఒప్పందాల్లోపెద్ద మొత్తాలు చేతులు మారాయన్న ఆరోపణలపైదర్యాప్తులు జరగబోతున్నాయి. చంద్రబాబునాయుడి పాలన ఒక రకం. కాంగ్రెస్‌పాలన మరో రకం. ఉభయుల ప్రాధమ్యతల్లోఎంతో తేడా ఉంది.

  • బాబుకు బ్రేకులు
  • ఇప్పటి బాబు దినచర్య
  • అదేతీరు!
  • సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X