దేశంలో మళ్లీ లాక్ డౌన్..?? ప్రధాని మోదీ సంచలనం..??

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాతో యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పేద, మధ్య తరగతి, అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందిన దేశాలు అని తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ పైనా పడింది. మన దేశంలోనూ అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లోనూ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే ఈ పరిణామాల మధ్య తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చూస్తే రానున్న రోజుల్లో దేశంలో లాక్ డౌన్ తరహా పరిస్థితులు రావచ్చని ఆయన సూచనలు చేసినట్లు స్పష్టం అవుతోంది.

తాజాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకుంటే మంచిదని తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రెండు నెలలుగా ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోస్తుందని తెలిపారు. ఈ మేరకు ప్రజలు మెట్రో తరహా ప్రయాణాలను ఎంచుకోవాలని సూచనలు చేశారు. అలాగే వంటనూనె వాడకాన్ని సైతం సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారుప్రధాని మోదీ. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

PMModi Urges Reduction in Petrol and Diesel Usage Buy Electric Vehicles and Avoid Foreign Travel

ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. గత నెలలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆహ్వానించినా ఇరాన్ అందుకు అంగీకరించలేదు. దాంతో ట్రంప్ హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం విధించారు. ఈ మేరకు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+